సిద్దార్ధ్ 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' స్టోరీలైన్
చిత్రం కథ గురించి దర్శకుడు సుందర్. సి. మాట్లాడుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేయాలన్నది కుమార్ ఉద్దేశం. చేసే పనిలో కష్టం ఉన్నా ఫలితం మధురంగా ఉంటుందని అతనికి చెప్పిందెవరు? అతని ఆలోచనల్ని మార్చాలని ప్రయత్నించినవాళ్లకి ఎదురైన అనుభవాలేమిటన్నది తెర మీదే చూడాలన్నారు
నిర్మాత మాట్లాడుతూ ''ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందీ చిత్రం. సిద్ధార్థ్, హన్సికల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఇటీవల విడుదల చేసిన గీతాలకు మంచి స్పందన వస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి. వచ్చే నెల ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాము''అన్నారు.
అనువాదచిత్రాల నిర్మాతగా పేరు గాంచిన శ్రీలక్ష్మీగణపతి పిక్చర్స్ సంస్థ అధినేత బి.సుబ్రహ్మణ్యం తొలి ప్రయత్నంగా ఎన్.సురేష్‌తో కలిసి నిర్మిస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. ఈ చిత్రంలో సుధ, వేణుమాధవ్, గౌతంరాజు, గణేష్ వెంకటరామన్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: గోపీ అమర్‌నాథ్, సంగీతం: సత్య, పాటలు: వనమాలి.


Click it and Unblock the Notifications












