twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్దార్ధ్ 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' స్టోరీలైన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సిద్దార్థ్, హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'. ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. బ్రహ్మానందం ఈ చిత్రంలో లవ్ గురు గా హైలెట్ కానున్నారు. ఇందులో సిద్దార్ద పాత్ర పేరు కుమార్.

    చిత్రం కథ గురించి దర్శకుడు సుందర్. సి. మాట్లాడుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేయాలన్నది కుమార్‌ ఉద్దేశం. చేసే పనిలో కష్టం ఉన్నా ఫలితం మధురంగా ఉంటుందని అతనికి చెప్పిందెవరు? అతని ఆలోచనల్ని మార్చాలని ప్రయత్నించినవాళ్లకి ఎదురైన అనుభవాలేమిటన్నది తెర మీదే చూడాలన్నారు

    నిర్మాత మాట్లాడుతూ ''ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందీ చిత్రం. సిద్ధార్థ్‌, హన్సికల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఇటీవల విడుదల చేసిన గీతాలకు మంచి స్పందన వస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి. వచ్చే నెల ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాము''అన్నారు.

    అనువాదచిత్రాల నిర్మాతగా పేరు గాంచిన శ్రీలక్ష్మీగణపతి పిక్చర్స్ సంస్థ అధినేత బి.సుబ్రహ్మణ్యం తొలి ప్రయత్నంగా ఎన్.సురేష్‌తో కలిసి నిర్మిస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. ఈ చిత్రంలో సుధ, వేణుమాధవ్‌, గౌతంరాజు, గణేష్‌ వెంకటరామన్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: గోపీ అమర్‌నాథ్‌, సంగీతం: సత్య, పాటలు: వనమాలి.

    English summary
    
 Siddharth, Hansika starrer Something…Something is now gearing up for release on June 14. Sundar C has directed the film and Khushboo has produced it. Lakshmi Ganapathi Films has bought the rights for the Telugu version. Brahmanandam is playing important role in the film and he’ll be seen as a love guru who gives tips to Siddharth to woo Hansika. Sathya has scored the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X