'శ్రీరామ రాజ్యం' సెట్స్ అయిన ఖర్చెంత?
బాపు, బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. ఈ చిత్రంలో సెట్స్ కు అత్యంత ప్రాధాన్యత ఉంది. నాలుగు కోట్లు ఖర్చు పెట్టి మరీ సెట్స్ ని రూపొందించారు.ఆ సెట్టింగ్స్‌కి ఉపయోగించిన కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు రూ. ఆరు కోట్లు ఖర్చయింది. అంటే మొత్తం రూ. పది కోట్లు ఈ సెట్టింగ్స్‌కి అయ్యాయి. వీటి గురించి కళా దర్శకుడు కిరణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...500 మంది కళాకారులు, కార్మికులు 90 రోజుల పాటు రాత్రింబవళ్లు పనిచేసి వీటిని నిర్మించారు. వీటన్నింటిలో నాకు బాగా ఇష్టమైంది శయనమందిరం. ఈ సెట్లకు వాటర్ కలర్స్ కాకుండా మెటాలిక్ కలర్స్ వాడాను. దానివల్ల రంగులకు సంబంధించి ఆరు రెట్లు ఖర్చు ఎక్కువైనా నాణ్యత పెరిగింది. సెట్టింగ్స్ అంత ప్రకాశవంతంగా కనిపించడానికి కారణం ఆ మెటాలిక్ రంగులే అన్నారు.
అలాగే ఆయనకిది కళా దర్శకుడుగా తొలి చిత్రం.దాని గురించి చెపుతూ..కళాదర్శకునిగా నా తొలి చిత్రం 'శ్రీరామరాజ్యం' కావడం ఎంతో ఆనందంగా ఉంది. బాపు వంటి లెజండరీ డైరెక్టర్‌తో పనిచేయడం మరపురాని అనుభవం. బాపుగారే డైరెక్ట్ చేసిన 'సంపూర్ణ రామాయణం'తో పాటు ఎన్టీఆర్‌గారి 'దానవీరశూరకర్ణ' వంటి చిత్రాలు ఈ సెట్స్ రూపకల్పనకు తోడ్పడ్డాయి. ఈ సినిమా కోసం మొదట రాజదర్బార్ సెట్ వేసి, ఆ తర్వాత వరుసగా పూజామందిరం, కౌసల్య మందిరం, సీతారాముల శయన మందిరం రూపొందించాను అన్నారు. పది కోట్లు ఈ సెట్టింగ్స్‌కి అయ్యాయి. ఈ సినిమా పట్ల సాయిబాబుగారి కమిట్‌మెంట్ అద్భుతం. లవకుశుల కథని ఈ తరానికి చెప్పాలన్న ఏకైక లక్ష్యంతో ఖర్చుకు వెనుకాడకుండా 'శ్రీరామరాజ్యం'ను నిర్మించారు అన్నారు.


Click it and Unblock the Notifications











