»   »  వీర్యదానం చేస్తానంటూ... విర్రవీగి

వీర్యదానం చేస్తానంటూ... విర్రవీగి

Posted By:
Subscribe to Filmibeat Telugu

''సున్నితమైన అంశంతో తెరకెక్కిన చిత్రమిది. నేను ఈ సినిమా చేయడానికి 'గోల్కొండ హైస్కూల్‌' నిర్మాత రామ్మోహన్‌ కూడా ఓ కారణం. ఆయనే దర్శకుడిగా మల్లిక్‌రామ్‌ పేరుని సూచించారు. తెలుగులో స్క్రీన్‌ప్లేని మార్చి చాలా బాగా తెరకెక్కించాడు. పరిమిత వ్యయంతో 60 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఇంటిల్లిపాదినీ మెప్పిస్తుందీ చిత్రం. నా సినీ ప్రయాణానికి కూడా మేలు చేస్తుందని నమ్మకంగా ఉన్నా'' అన్నారు సుమంత్.

సుమంత్ హీరోగా నటించిన చిత్రం 'నరుడా డోనరుడా'. హిందీలో విజయవంతమైన 'విక్కీ డోనర్‌'కి రీమేక్‌గా మల్లిక్‌రామ్‌ తెరకెక్కించారు. జాన్‌ సుధీర్‌ పూదోట, వై.సుప్రియ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 4న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Read more about: sumanth
English summary
'Naruda Donaruda' is the Telugu remake of super hit Bollywood film 'Vicky Donor' .Through the first look, it has been revealed that Sumanth is playing a sperm donor in this quirky comedy and he has a 100% strike rate in this arena.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu