'ప్రతి పరదా వెనక ..' గుట్టు రట్టు
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చాలా చోట్ల ఓ విభిన్నమైన పోస్టర్స్ కనపించాయి. సినిమా పేరు. .క్రూ చెప్పకుండా... ఈ ముసుగు వెనుక రహస్యం దాగుందని వెరైటీ పబ్లిసిటీ చేసారు. అందరిలో ఆసక్తి రేపిన ఈ చిత్రం టైటిల్ మరేదో కాదు 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'. శ్రావ్య ఫిలింస్ బేనర్‌పై పి. సునీల్‌కుమార్ దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు నిర్మించారు. డి. సురేష్‌బాబు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ - దర్శకుడు సునీల్ చాలాకాలంనుంచి తెలుసు. తను చేసే ప్రతి పనినీ నమ్మకంతో చేస్తాడు. మంచి సినిమా తీస్తున్నాడని భావిస్తున్నాను అన్నారు.
తాము ఏం చేస్తున్నామో తమకే తెలియని స్థితిలో యువతరం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనల్ని చూస్తే యువత ఎంత భయంకరంగా ఆలోచిస్తుందో అర్థమవుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ పరదా వేసి దాస్తున్నారు. ఆ పరదా వెనుక ఉన్న రహస్యం ఏమిటో మా చిత్రంలో చూపిస్తున్నాం అంటున్నారు చిత్ర దర్శకుడు సునీల్‌కుమార్. అలాగే మనం చేసే ఏ పనిలోనైనా రహస్యం ఉంటుంది. కానీ ఆ రహస్యాన్ని ఎంతో కాలం దాచలేం. ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. దాన్నే కాన్సెప్ట్‌గా తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి ఈ చిత్రంలో చర్చించామని తెలియచేసారు.
సునీల్‌కుమార్‌రెడ్డి సొంత ఊరు, గంగపుత్రులు తర్వాత నేను చేసిన చిత్రమిది. 95 శాతం నేటి యువతకు సంబంధించిన కథ. ఈ చిత్రంద్వారా కొత్తవారిని పరిచయం చేస్తున్నారు. వైజాగ్ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ అంతా పూర్తిచేశారు. పిసి శ్రీరామ్ శిష్యుడు సబుజేమ్స్ ఈచిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసాడు. త్వరలో ఆడియోను విడుదల చేస్తున్నారు. నిర్మాత రవీంద్రబాబుమాట్లాడుతూ, నిర్మాతగా 9వ సినిమా. సునీల్ సినిమా అంటే అవార్డు సినిమా అనే పేరుంది. ఈ సినిమా అవార్డుకోసం చేయలేదు. మంచి కథతో ముందుకు వస్తున్నాం అన్నారు.
''ప్రధానంగా ముగ్గురు యువతుల చుట్టూ కథ తిరుగుతుంది. శృంగారం, హింస వీటి గురించి నేటి యువత ఏ రీతిన ఆలోచిస్తున్నారో చెబుతున్నారు. ఇదంతా వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో డీటియస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మనోజ్ నందం, గాయత్రి, సాయి అనిల్, దివ్య, స్వప్న, సత్యనారాయణ తదితరులు నటించారు. సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కో ప్రొడ్యూసర్స్: బసిరెడ్డి, కుర్ర విజయకుమార్.


Click it and Unblock the Notifications











