కృష్ణవంశీ 'మొగుడు'చిత్రంలో తాప్సీ పాత్ర ఏమిటంటే...
ఓ రాజకీయ నాయకుడి కూతురి పాత్రలో తాప్సీ ఈ చిత్రంలో కనిపించనుంది. భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆ పాత్రను డిజైన్ చేసారు. తాప్సీ పాత్ర ఇంట్రడక్షన్ ఓ భరత నాట్యం చేస్తూన్న సీన్ పై ఓపెన్ అవుతుంది. ఇక కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ రూపొందుతున్న చక్కటి ప్రేమ కథా చిత్రమిది. ఇక ఈ చిత్రం గురించి తాప్సీ మాట్లాడుతూ..గోపీచంద్‌తో 'మొగుడు'లో నటించడం ఆనందంగా ఉంది. కృష్ణవంశీ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు అంది.ఇక తాప్సీ నటించిన వీర చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఆమె హిందీలో ఓ చిత్రం అంగీకరించింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది.ఆ చిత్రం తర్వాత తమిళంలో నటిస్తుంది. అక్టోబర్ వరకూ 'మొగుడు' చిత్రంతో బిజీగా ఉంటుందామె. అలాగే మరికొన్ని తెలుగు కథలు విన్నాను. అవి ఇంకా చర్చల దశలో ఉన్నాయి అని చెప్పింది.


Click it and Unblock the Notifications











