'బాడీగార్డ్'కలెక్షన్స్ పరిస్దితేంటి?
సంక్రాంతి సందర్బంగా విడుదలైన మరో పెద్ద చిత్రం బాడీగార్డ్. వెంకటేష్,త్రిష కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీలకు నచ్చేలా ముస్తాబై వచ్చింది. రిలీజైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మీడియాలోనూ,వెబ్ సైట్స్ లోనూ మంచి రివ్యూలు తెచ్చుకుంది. ట్రేడ్ లో చెప్పుకునే దాని ప్రకారం ..మొదటి రోజు ఆరున్నర కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. మల్టిప్లెక్స్ లలోనూ, సింగిల్ స్క్రీన్ ప్రొజక్షన్ లోనూ ఆక్యుపసీ రేటు ..85 నుంచి 90% ఉంది. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ ఓ రేంజిలో కాంపిటేషన్ ఇస్తూండటంతో కాస్త ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే టాక్ పాజిటివ్ గా ఉండటం, ఫ్యామిలీలకు నచ్చే ఎలిమెంట్స్ ఉండటంతో నిర్మాతలు ధీమాగా ఉన్నారు. రెండో రోజు కూడా ఆరు కోట్ల వరకూ కలెక్టు చేసిందని,సినిమా బడ్జెట్ కి అది మంచి రాబడే అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం మళయాళ రీమేక్ గా రూపొందింది. గతంలోనూ వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో ఆడువారి మాటలకు అర్దాలే వేరులే,నమో వెంకటేశ చిత్రాలు వచ్చి విజయవంతమయ్యాయి. ఇప్పుడీ చిత్రం ఆ లిస్ట్ లో చేరింది. అలాగే సంక్రాతికి గతంలో వెంకటేష్ చిత్రాలు కలిసుందాంరా,లక్ష్మి చిత్రాలు వచ్చి సైలెంట్ హిట్ లుగా నిలిచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











