twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతకు ట్విస్ట్ ...చిత్రం ఆపేయాలని కమిటీ సిఫారసు?

    By Srikanya
    |

    హైదరాబాద్: బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినే రీతిలో, బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే విధంగా 'ఉమన్ ఇన్ బ్రాహ్మనిజం' చిత్రం రూపొందిందని, కావున ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఓ వివాదం రేకెత్తుతోన్న విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్స్‌ను చూసి, పలు బ్రాహ్మణ సంఘాలు తమ వ్యతిరేకతను ఆ విధంగా వెలిబుచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సినిమా వివాదం పరిష్కరించే దిశగా ఓ కమిటీని నియమించింది.

    శిశు సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి నీలం సహాని నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటి హైదరాబాద్‌లోని చలనచిత్ర అభివృద్ది మండలి కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గం.లకు ఈ చిత్రాన్ని తిలకించింది. చిత్ర నిర్మాత జీటీ పూరి ఇందులోని కొన్ని సన్నివేశాలు తొలగించడానికి ఆమోదం తెలిపినప్పటికీ కమిటీ సభ్యులు అందుకు అంగీకరించలేదని, సినిమా విడుదల పూర్తిగా ఆపేయవలసిందిగా నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వదలిచినట్లు తెలిసింది.

    మరో ప్రక్క 'ఉమన్ ఇన్ బ్రాహ్మనిజం' చిత్రంపై చర్యలు తీసుకోవాలని 'ఛలో రాజ్‌భవన్'కు బుధవారం బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సినిమాలో బ్రాహ్మణ మహిళను అసభ్యకరంగా చిత్రీకరించారని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.'దేనికైనా రెడీ' చిత్ర హీరో మంచు విష్ణును తక్షణమే అరెస్టు చేయాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సినిమాను నిషేధించాలని గత కొంత కాలంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

    చలం 1937లో రాసిన 'బ్రాహ్మణీకం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాత చెబుతున్నారు. చలం వంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం పేరును అడ్డుపెట్టుకుని, బ్రాహ్మణ స్త్రీలను కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. మరో వైపు సెన్సార్ బోర్డుపై కూడా బ్రహ్మణ సంఘాలు ఫైర్ అయ్యాయి. ఇలా ఒక కులం ప్రస్తావనతో టైటిల్ పెట్టి సినిమాలు తీస్తుంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తుందని, ఇలాంటి వాటికి ఎలా అనుమతి ఇచ్చారని ఆ సంఘం నేతలు మండి పడుతున్నారు. బ్రాహ్మణ మహిళలను కించపరిచేలా ని ర్మించిన 'ఎ ఉమన్ ఇన్ బ్రామ్మణిజం' చిత్ర నిర్మాత గంగాధర్‌పై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్‌లో ఉన్న ఆ చిత్ర ట్రైలర్‌ను కూడా తొలగించారు.

    English summary
    A Woman is Brahmanism film dispute...A nine-member committee was constituted by the State government on Saturday to look into the issues related to the film ‘A Woman in Brahmanism’. The film is yet to be released in the State.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X