'యమలోకంలో జై తెలంగాణ' స్టోరీ లైన్ ఏంటంటే...
అమరులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలు చివరకు యమపురిని తాకి యమధర్మరాజుతో కూడా కన్నీరు పెట్టిస్తాయి. వలసవాదుల ఆగడాలకు బలయి తెలంగాణ బిడ్డలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చిందో ఈ సినిమాలో చూపిస్తున్నాం అని 'యమలోకంలో జై తెలంగాణ' చిత్రం స్టోరీ లైన్ గురించి 'రసమయి' బాలకిషన్ అన్నారు. తెలంగాణ కళాకారుడు 'రసమయి' బాలకిషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'యమలోకంలో జై తెలంగాణ' చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూల్ భువనగిరిలో, రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగిందని, నాలుగు పాటలు, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించామని బాలకిషన్ చెప్పారు.ఇక ఈ చిత్రంలో గౌతంరాజు, కోట శంకరరావు, రాజా రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో యముడిగా శ్రీనివాస్ చౌదరి, చిత్రగుప్తుడిగా రసమయి, అగ్నిదేవుడిగా శ్రీధర్ ధర్మాసనం, వాయుదేవుడిగా కుమార్, వరుణ దేవుడిగా మధు, భూదేవిగా అరుంధతి నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











