‘మెగా’ రేంజ్‌కి తగ్గట్టు చెర్రీ ఎంగేజ్మెంట్ పాసులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్- ఉపాసన కామినేని నిశ్చితార్థం డిసెంబర్ 1న జరుగబోతున్న విషయం తెలిసిందే. చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ లోని ఉపాసన కుటుంబీకులకు చెందిన పాం హౌజ్ లో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడకకు ఎవరూ పడితే వారు హాజరుకావడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేవలం సన్నిహితులు, చిరు ఆహ్వానం అందుకున్న వీవీఐపీలకు మాత్రమే ఇందులో ఎంట్రీ ఉంది. మామూలు పాసులు అయితే వెరైటీ ఏముంది? అనుకున్నారో ఏమో....తమ రేంజ్ కి తగిన విధంగా ఎలక్ట్రానిక్ ఎంట్రీ పాసులను తయారు చేయించారు మెగా-కామినేని కుటుంబ సభ్యులు.
ఏటిఎం కార్డుల మాదిరి ఉన్న ఈ ఎంట్రీ పాస్ స్వైప్ చేయగానే ఎంగేజ్మెంట్ వేడుకలో ఎంట్రీ అవ్వడానికి గేట్లు తెరుచుకుంటాయి. మామూలుగా కార్పొరేట్ ఆఫీసుల్లో మాత్రమే ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయి. మన రాష్ట్రంలో ఓ ఎంగేజ్మెంట్ కు ఇలాంటి ఎలక్ట్రానిక్ కార్డులను వాడటం ఇదే తొలిసారి అంటున్నారు. ఎంట్రీలోనే ఇలా ఉందంటే లోపలికి వెళ్లిన తర్వాత ఎన్ని విచిత్రాలు ఉంటాయో? ఇరు కుటుంబాల వారు కోట్లకు పడగలెత్తిన ధనవంతులు కాబట్టి ఇలాంటి ఏర్పాట్లకు కొదవేముంటుంది లెండి.


Click it and Unblock the Notifications











