కోలుకుంటున్న రామ్ చరణ్ తేజ

By Staff

Ram Charan Teja
మగదీరా షూటింగ్ లో గాయపడ్డ రామ్ చరణ్ తేజ ఇప్పుడే కోలుకుంటున్నారని సమాచారం. అలాగే ఇధేమీ పేద్ద గాయం ఏమీ కాదని అని యూనిట్ వర్గాలు చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ విశ్రాంతి సమయంలో క్లాస్సిక్ మూవీస్ చూస్తూ, నెట్ బ్రౌసింగ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు అని తెలుస్తోంది. ఇక మగదీరా షూటింగ్ లో ఫైట్ మాస్టర్ పీటర్ హేయైన్స్ సైతం గాయపడ్డారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు గాఢంగా కోరుకుంటూ...సందేసాలు పంపుతున్నారు. ఇక ఈ విషయానికి అనవసరమైన పబ్లిసిటీ వస్తుందని బయిటక పొక్కనీయకుండా జాగ్రత్తలు పడుతున్నారు. మీడియా సంస్ధలను సైతం కవర్ చేయవద్దని అడిగారని వినికిడి.

రాజమౌళి..దర్శకత్వంలో మగధీర చిత్రం రూపొందుతోంది. పునర్జన్మ నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు నాలుగువందల సంవత్సరాల క్రిందట ప్రారంభమయ్యే కథ ఈ కాలంతో ముగుస్తుందని చెప్తున్నారు. అలాగే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే హార్స్ రైడింగ్, ఛేజింగ్ సీన్స్ భారీగా తీసారని అంటున్నారు. రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ చిత్రంలో బంగారు కోడిపెట్ట రీమిక్స్ లో తళుక్కుమననున్నారు. ఆ పాటలో రామ్ చరణ్ కి జోడీగా ముమైత్ చిందులు వేయనుంది. ఇక కాజల్, రామ్ చరణ్ ల మధ్య ప్రేమ కథ ప్రధానాంశంగా కథ, కథనాలు నడుస్తాయని చెప్పుకుంటున్నరు. శ్రీహరి కూడా ఓ ప్రత్యకమైన పాత్రలో కనిపించనున్నారు. గత జన్మలో ఈ ప్రేమికులు విడిపోవటానికి కారణమైన ఆయన ఈ జన్మలో వీరిద్దరినీ ఎట్టిపరిస్ధితుల్లో కలపటానికి పోరాడతారని ఫిల్మ్ నగర్ సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X