»   » నాగచైతన్య షూటింగ్ (ధాయలాండ్) లో ప్రమాదం..

నాగచైతన్య షూటింగ్ (ధాయలాండ్) లో ప్రమాదం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య హీరోగా అజయ్ భుయాన్ డైరక్ట్ చేస్తున్న చిత్రం షూటింగ్ ధాయలాండ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒకరికొకరు హీరో శ్రీరామ్..నాగచైతన్యకు సోదరుడుగా నటిస్తున్నాడు. అనుకోకుండా అక్కడ ఓ చిన్న ప్రమాదం జరిగి షూటింగ్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. షూట్ చేస్తున్న షాట్ ప్రకారం శ్రీరామ్..ఆరవ ప్లోర్ నుంచి పరుగెత్తికొచ్చి మూడవ ప్లోర్ లోకి దూకి అక్కడ నుంచి గ్రౌండ్ మీదకు దూకాల్సి వచ్చిన యాక్షన్ ఎపిసోడ్ అది. మొదటి స్టంట్ మాస్టర్స్ తో రిహార్సల్స్ వేసుకుని షూట్ ప్రారంభించారు. అలాగే రెండున్నర నిముషాలు పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఊహించని విధంగా శ్రీరామ్..మూడవ ప్లోర్ మీద నుంచి క్రిందకి దూకేటప్పుడు కాలు మడతపడిపోయింది. అప్పటికీ అక్కడ సేప్టీగా ఉండటం కోసం క్రింద మేట్రస్ ఉంచారు. కానీ ఫలితం లేకపోయింది. కాలు ఫాక్చర్ అవటంతో వెంటనే హాస్పటిల్ కి తీసుకెళ్ళి ట్రీట్ మెంట్ ప్రారంభించారు. ప్రస్తుతం కాలకు కట్టుకట్టే ఉంచారని సమాచారం. దాంతో శ్రీరామ్ కాంబినేషన్ లో చేయాల్సిన సీన్స్ ఆపుచేసి నాగచైతన్య మీద సీన్స్ ని కంప్లీట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ షెడ్యూలు ధాయలాండ్ లో ఇరవై ఐదు రోజుల పాటు జరుగుతుంది. కాజల్ హీరోయిన్ గా రూపొందే ఈ చిత్రాన్ని కామాక్షి ఎంటర్ ప్రైజస్ వారు నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu