»   » కారు నడిపింది నేనే, ప్రమాదం నిజమే, నేను సేఫ్: బాలయ్య

కారు నడిపింది నేనే, ప్రమాదం నిజమే, నేను సేఫ్: బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాహనానికి ప్రమాదం జరిగింది. బుధవారం హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అనంతరం బెంగళూరు విమానాశ్రయానికి వెళ్తుండగా కర్ణాటకలోని బాగేపల్లి వద్ద వాహనం ప్రమాదానికి గురైంది.

ఓ లారీని ఓవర్ టేక్ చేయబోయినపుడు పశువులు అడ్డురావడంతో కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ ను ఢీకొట్టిందని భావించారు. కానీ, బాలకృష్ణ ఇచ్చిన వివరణ మరో విధంగా ఉంది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో వాహనంలోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

Accident to Balakrishna's Convoy in Karnataka

యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ కాలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తాను స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా పూలమాల వచ్చి అద్దం మీద పడడంతో రోడ్డు సరిగా కనిపించక డివైడర్‌ను ఢీకొట్టానని, కారు టైరు బ్లాస్ట్ కావడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు.

తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ పేర్కొన్నారు.

సోమవారం బాలయ్య హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన 101వ సినిమా ప్రకటించారు. ఆయన అక్కడి రైతులను కలుసుకుని వారి కష్టసుఖాలను పంచుకున్నారు. రైతులకు రుణ మాఫీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన తన 101వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రకటన చేశారు.

Accident to Balakrishna's Convoy in Karnataka

రైతు దేశానికి ఎంత అవసరం, రైతు సమస్యలేంటి అనే విషయాలను తెలియజేసే చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందనున్న రైతు చిత్రమే తన 101వ చిత్రమని ప్రకటించారు. ప్రజా సమస్యలపై తనదైన శైళిలో గళమెత్తే నందమూరి బాలకృష్ణ రైతు సినిమాలో నటించనుండటం పట్ల ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియపరుస్తారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Balakrishna's car met with an accident in Karnataka. Fortunately he is not injured in this incident and his fans took a relief.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu