For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐశ్వర్యరాయ్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

By Rajababu
|
ఐశ్వర్యరాయ్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం..

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ నటిస్తున్న తాజా చిత్రం ఫన్నేఖాన్. ఈ చిత్రంలో ఆమె గాయని పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్టర్. ఈ చిత్ర షూటింగ్ ముంబైలోని ఫ్లోరా ఫౌంటేన్ ప్రాంతంలో బిజీగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఆదివారం జరిగిన షూటింగ్‌లో ఓ ప్రమాదం చోటుచేసుకొన్నది. ఈ సందర్బంగా ఓ యువతి తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అసలు ప్రమాదమేలా జరిగిందంటే..

రోడ్డుపై షూటింగ్..

రోడ్డుపై షూటింగ్..

ఫన్నేఖాన్ షూటింగ్‌లో రోడ్డుపై ఓ సీనును చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ ఈ చిత్రానికి పనిచేస్తున్న మూడో అసిస్టెంట్ డైరెక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.

 అసిస్టెంట్ డైరెక్టర్‌కు గాయాలు

అసిస్టెంట్ డైరెక్టర్‌కు గాయాలు

ప్రమాదం జరిగిన సమయంలో మహిళా అసిస్టెంట్ డైరెక్టర్ వాకీ టాకీకి కనెక్ట్ చేసిన హెడ్‌ఫోన్స్ పెట్టుకొన్నట్టు సమాచారం. వాటి కారణంగా బైక్ వచ్చే శబ్దం వినిపించకపోవడంతో ప్రమాదం చోచుచేసుకొన్నది. వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్సను అందిస్తున్నాం అని చిత్ర యూనిట్ వెల్లడించారు.

హుటాహుటిన ఐశ్వర్యరాయ్

హుటాహుటిన ఐశ్వర్యరాయ్

రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్ గాయపడిందనే సమాచారం తెలుసుకొన్న ఐశ్వర్యరాయ్ హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకొన్నారు. అయితే అక్కడ జనసమూహం ఎక్కువగా ఉండటంతో ఐశ్వర్యను తన భద్రతా సిబ్బంది వెనుకకు తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది.

 డచ్‌ చిత్రానికి రీమేక్‌గా ఫన్నేఖాన్

డచ్‌ చిత్రానికి రీమేక్‌గా ఫన్నేఖాన్

2000 సంవత్సరంలో విడుదలైన డచ్ చిత్రం ఎవ్రీబడీ ఫేమస్ అనే చిత్రానికి ఫన్నేఖాన్ సినిమా రీమేక్. అయితే బాలీవుడ్ చిత్రాలకు సరిపడే విధంగా కథలో అనేక మార్పులు చేపట్టినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌తో యువహీరో రాజ్‌కుమార్ రావు రొమాన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాళ్ చిత్రం తర్వాత దాదాపు 18 గ్యాప్ తర్వాత ఐశ్వర్య రాయ్, అనిల్ కలిసి నటించడం ఇదే తొలిసారి.

English summary
Rakyesh Omprakash Mehra's next has been in news more than ever. As soon as the look of Aishwarya Rai Bachchan from the musical hit the web, the news of an accident on the sets of Fanney Khan also came out. On November 5, as Aishwarya was busy shooting for a scene in the Flora Fountain area of Mumbai, a crew m
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more