ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఆ మూడు బంపర్ హిట్టే...!
ఇన్నాళ్ళూ గంటకో మాట మారుతూ..రోజుకో డేటు వినిపిస్తూ వచ్చిన ఈ రెండు చిత్రాల విడదుల విషయం ఇప్పుడిలా కూల్ గా సెటిలవడం వెనుక కూడా పలు కారణాలున్నాయిలెండి. అవన్నీ తర్వాత చెప్పుకుని తాఫీగా చర్చించు కానీ ముందైతే మీరంతా ఫిక్స్ అయిపోండి. అక్టోబర్ 1న రోబో ప్రపంచమంతా సంచలనం సృష్టిచబోతోంటే అక్టోబర్ 7న వెండితెరపై కనిపించే మహేష్ 'ఖలేజా"ఆస్వాదనకీ...అక్టోబర్ 13న బృందావనం" తో జూ ఎన్టీఆర్ పంచే ఆహ్లాదానికీ...
'రోబో", 'ఖలేజా", 'బందావనం"...ఈ మూడు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో రూపొందిన చిత్రాలే. ఈ సినిమాలు ఒక వారం గ్యాప్ లో విడుదలవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ మూడు హిట్ అవుతాయా? అనే చర్చలు సాగుతున్నాయి. కానీ ఈ మూడు భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలు కావడం, క్రేజీ ప్రాజెక్ట్ లు కావడంతో ఖచ్చితంగా బాక్సీపీస్ వద్ద ఈ మూడు చిత్రాలు విజయం సాధిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విధంగా గతంలో ఒకేసారి పెద్ద హీరోల సినిమాలు విడుదలయిన దాఖలాలు ఉన్నాయి. ఆ చిత్రాలు సాధించిన విజయాన్నిదృష్టిలో పెట్టుకునే ట్రేడ్ వర్గాలు ఈ విధంగా అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











