ఒక్క రోజు గ్యాప్‌తో.. వెంకీ, చిరు బాక్సాఫీస్ పోరు.. అప్పుడే ఫ్యాన్స్ వార్ షురూ

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో అందరూ కూడా ఓ పద్దతిని ఫాలో అవుతున్నారు. ఎవరు తొందరగా కర్చీప్‌లు వేసుకుంటే ఆ డేట్స్ తమవే. అలా పోటీల్లేకుండా రిలీజ్ చేయాలని అందరూ భావిస్తుంటారు. అందుకే పెద్ద సినిమాలన్నీ కూడా తమ తమ రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు. దీంతో బోనీ కపూర్ ఘోరంగా హర్ట్ అయ్యాడు. అది అన్యాయం అంటూ బహిరంగంగానే అసమ్మతిని ప్రకటించాడు.

 తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

పెద్ద పెద్ద సినిమాలు గ్యాప్ లేకుండా విడుదల చేస్తే ఎంత నష్టం వస్తుందో ఊహించలేం. ఒకవేళ రెండూ బాగున్నా కష్టమే.. రెండూ ఫ్లాప్ అయినా కష్టమే.. ఒకటి బాగుండి.. ఇంకోటి ఫ్లాప్ అయితే మరీ కష్టం. అందుకే చిత్ర నిర్మాతలు విడుదల విషయంలో ఎన్నో జాగ్రత్తలు పడుతుంటారు.

చిరు, వెంకీల పోరు..

చిరు, వెంకీల పోరు..

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఈ సమ్మర్‌లో బాక్సాఫీస్ వద్ద యుద్దం చేసేలానే కనిపిస్తున్నారు. ఎందుకంటే తాజాగా ఈ రెండు చిత్రాల నిర్మాతలు విడుదల తేదీలను ప్రకటించారు. ముందుగా నారప్ప మే 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత కాసేపటికి మే 13న ఆచార్య రాబోతోందని ప్రకటించారు.

రెండూ పెద్ద చిత్రాలే..

రెండూ పెద్ద చిత్రాలే..

వెంకీ నారప్ప, చిరు ఆచార్య రెండూ కూడా పెద్ద ప్రాజెక్ట్‌లే. అందులో నారప్ప కథ దాదాపుగా అందరికీ తెలిసిందే. అది రీమేక్ సినిమా. అయినా కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మరో వైపు కొరటాల శివ చిరంజీవి కాంబో. ఇందాక విడుదల చేసిన ఆచార్య టీజర్‌తో అంచనాలు ఆకాశన్నంటాయి.

 ఒక్క రోజు గ్యాప్..

ఒక్క రోజు గ్యాప్..

అయితే ఆచార్య, నారప్పకు గ్యాప్ ఒక్కరోజు మాత్రమే ఉంది. దీంతో ఇప్పటికే ఫ్యాన్స్ వార్ మొదలైంది. ఎవరివి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి.. మొదటి రోజు రికార్డులంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే చివరకు వరకు పరిస్థితి ఇలానే ఉంటుందా? లేదా చివరి నిమిషంలో ఎవరి నిర్ణయమైన మారుతుందా? అన్నది చూడాలి. ఇలా ఒక్క రోజు గ్యాప్‌తో వస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X