డ్రీమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ.. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా బయోపిక్ ప్లాన్?
సందేశాత్మక చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు కొరటాల శివ ఈసారి ఆచార్య సినిమాతో ధర్మం అనే పాయింట్ ను తనదైన శైలిలో కమర్షియల్ అంశాలతో చూపించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన యాక్షన్ డ్రామా కోసం మెగా అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అపజయాలు లేకుండా..
కథా రచయితగా ఎన్నో సినిమాలకు పని చేసిన కొరటాల శివ ఆ తర్వాత మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ప్రభాస్ అనుష్క జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా కొరటాల శివ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. అనంతరం అతను అపజయాలు లేకుండా ముందుకు కొనసాగుతున్నాడు.

ఎప్పటికి గుర్తిండిపోయే..
ప్రభాస్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరు హీరోలకు వరుసగా విజయాలు ఇచ్చిన కొరటాల శివ ఇప్పుడు తన ఐదవ సినిమాతో మెగా స్టార్ చిరంజీవికి అలాగే రామ్ చరణ్ తేజ్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాల్సింది. కానీ పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే.

భారీ అంచనాలు
ఆచార్య సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా హైలోనే ఉన్నాయి. తప్పకుండా సినిమా మొదటి రోజు భారీగా కలెక్షన్స్ అందుకుంటుంది అని అర్థమవుతోంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త స్టైల్లో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా 40 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో నటించడంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని దాటేశాయి.

కొరటాల డ్రీమ్ ప్రాజెక్ట్
దర్శకుడు కొరటాల శివ మరో సారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇక ఈ దర్శకుడితో సినిమా చేయాలని ప్రస్తుతం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక ప్రతి ఒక్క దర్శకుడికి కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్టు ఉన్నట్లుగానే కొరటాల శివకు కూడా ఒక విభిన్నమైన కలల ప్రాజెక్టు ఉన్నట్లుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

ఆ బయోపిక్
దైవత్వం ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా అడుగులు వేసే కొరటాల శివ ఎప్పటికైనా స్వామి వివేకానంద బయోపిక్ చేయాలని అనుకుంటున్నట్లు తెలియజేశాడు. హాలీవుడ్ వాళ్ళు ఎలాగైతే మాత్మ గాంధీ కథను ప్రపంచ స్థాయిలో తెరకెక్కించారో అలాగే స్వామి వివేకానంద కథను కూడా అదే తరహాలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా తెర పైకి తీసుకు రావాలని కోరుకుంటున్నట్లు ఈ దర్శకుడు తెలియజేశాడు.

ఎన్టీఆర్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్
ఇక ఆచార్య సినిమా విడుదల అనంతరం కొరటాల శివ పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా పై ఫోకస్ పెట్టనున్నాడు. ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ బడ్జెట్తో రూపొందించబోతున్నారు. తన సినీ కెరీర్ లోనే అది చాలా పెద్ద కథ అని తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని శివ చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications











