నష్టాల్లో మునిగాం.. డబ్బులు వాపసు ఇవ్వండి... ఆచార్య డిస్టిబ్యూటర్ల డిమాండ్
ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్ల ప్రదర్శన కొనసాగుతున్నది. ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని చవిచూడటంపై అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. తొలి ఆట నుంచే తీవ్ర నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు గత రెండు రోజులు కలెక్షన్లు మరింత అసంతృప్తికి గురిచేస్తున్నాయి. అయితే ఈ సినిమా నష్టాల నుంచి బయటపడేయాలనే డిస్టిబ్యూటర్లు వాదన ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన
ఆచార్య విషయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన కొనసాగుతుండటంతో దాదాపు సోమవారం నుంచి అన్ని షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో థియేటర్ల నుంచి ఆచార్యను ఎత్తివేయడం మెగా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ విషయం అభిమానులకు మింగుడు పడని పరిస్థితిగా మారింది.

70 కోట్ల నష్టం అంచనా
ఇక తొలివారాంతం తర్వాత మొదటి రోజు కలెక్షన్లు దారుణంగా ఉండటం, రెండో రోజు మంగళవారం కూడా అదే పరిస్థితి ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం 70 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే మెగాస్టార్ కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

యూఎస్‌లో దారుణంగా
అమెరికాలో కూడా అచార్య పరిస్థితి ఎదురైంది. ప్రీమియర్ల ద్వారా 600k వసూలు చేసిన ఈ చిత్రం ఆ తర్వాత కనీసంగా వసూళ్లను సాధించలేదు. ఫైనల్‌గా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది. అయితే దాదాపు యూఎస్‌లో ఆచార్య రన్ కంప్లీట్ అయ్యిందనే మాట వినిపిస్తున్నది. ఏపీ, తెలంగాణలో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతున్నది.

డిస్టిబ్యూటర్ల డిమాండ్ ఏమిటంటే?
అయితే ఆచార్యకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల్లో మునిగిన నేపథ్యంలో వారు తమకు నష్టాన్ని పూడ్చే విధంగా డబ్బు చెల్లించాలనే డిమాండ్ లేవనెత్తారు. అయితే డిస్టిబ్యూటర్లకు చిరంజీవి తదుపరి సినిమా హక్కుల విషయంలో డిస్కౌంట్ ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే నెక్ట్స్ సినిమాకు డిస్కౌంట్ అవసరం లేదు. డబ్బులు సెటిల్ చేయమని డిస్టిబ్యూటర్లు డిమాండ్ చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











