twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya Effect :మెగాస్టార్ కు డిస్ట్రిబ్యూటర్ లేఖ.. 75% నష్టపోయాం.. దయచేసి ఆదుకోండి అంటూ

    |

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో తరిగిన ఆచార్య సినిమా మార్చి 29 వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది అనుకున్న సినిమాకు కలెక్షన్లు ఏ మాత్రం రావడం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే పాత్రలో నటించగా సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటించాడు.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా తొలుత నటించింది. కానీ తర్వాత ఆమె పాత్ర పరిధి తక్కువగా ఉందని భావించి పూర్తిగా తగ్గించేశారు. కొణిదెల ప్రొడక్షన్స్ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి దగ్గరుండి నిర్మించారు..

    అయితే ఈ సినిమా కేవలం రెండు మూడు రోజులు మాత్రమే చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపిస్తోంది.. దాదాపు ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇప్పుడు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకకు చెందిన రాజగోపాల్ బజాజ్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ మెగాస్టార్ చిరంజీవికి ఈ విషయం మీద లేఖ రాశారు. సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు మేము పెట్టిన పెట్టుబడిలో కేవలం 25 శాతం మాత్రమే వసూలు వెనక్కి వచ్చాయి దాదాపు 75 శాతం నష్టపోయామని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏడాది క్రితమే అడ్వాన్స్ చెల్లించి సినిమా విడుదలకు ముందు పూర్తి మొత్తం చెల్లించి సినిమా విడుదల చేశామని కరోన కారణంగా ఇప్పటికే దారుణమైన నష్టాలు చూసిన మాకు ఈ ఆచార్య వల్ల మరింత పెద్ద దెబ్బ తగిలింది అని ఆయన పేర్కొన్నారు..

     Acharya Film distributor open letter to megastar Chiranjeevi

    బయట మార్కెట్లో అప్పు తీసుకొని వచ్చి ఆచార్య సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశామని కావున పెద్ద మనసుతో మా పరిస్థితి అర్థం చేసుకుని పరిహారం చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు.. మరి ఈ లేఖ మీద మెగాస్టార్ చిరంజీవి ఏవిధంగా స్పందిస్తారో అనేది వేచి చూడాల్సి ఉంది. నైజాం హక్కులు కొనుక్కున్న వరంగల్ శ్రీను నుంచి రాజగోపాల్ బజాజ్ ఒక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుక్కున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ను ఒడ్డున పడేసేందుకు ఇప్పటికే నిర్మాతలుగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ కూడా తనకు సన్నిహితులైన కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కి తన రాబోయే సినిమాల విషయంలో అవకాశం కల్పించి గట్టెక్కి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    English summary
    Acharya Film distributor open letter to megastar Chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X