మహేష్ లెక్చరర్ కాదు..‘ఆచార్య’టైటిల్ కాదు: సుకుమార్
హైదరాబాద్ : మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి పెద్దగా న్యూస్ లు ఏమీ బయిటకు రావటం లేదు. దాంతో రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. చిత్రంలో మహేష్ లెక్చరర్ గా కనిపిస్తున్నాడని, టైటిల్ 'ఆచార్య' అని మీడియాలో వినిపించాయి. ఈ నేపధ్యంలో ఆ రూమర్స్ ని ఖండిస్తూ...దర్శకుడు సుకుమార్ క్లారిఫై చేసారు.
సుకుమార్ మాట్లాడుతూ... ఈ సినిమాకు 'ఆచార్య' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇంకా చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే అవేవీ కావు. అసలింతవరకూ మేం టైటిల్ గురించే ఆలోచించలేదు. ఈ సినిమాకు టైటిల్ ఎంపిక చేయడం కొంచెం కష్టమే అని అన్నారు.
అలాగే ...ఇందులో మహేశ్ లెక్చరర్‌గా నటిస్తున్నారనేది కూడా అవాస్తవమే. ఈ చిత్రంలో ఆయన పాత్ర సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. మహేశ్‌ని ఏ విధంగా చూపించబోతున్నాను అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. తనదైన శైలిలో ఉంటూనే కొంచెం నా బాణీ కనిపిస్తుంది.కొంచెం టిపికల్‌గా అనిపిస్తూ, పూర్తి స్థాయి కమర్షియల్ విలువలతోనే సినిమా ఉంటుంది. అసలు ఈ సినిమా వేరే స్థాయిలో ఉంటుంది. అతిశయోక్తిగా అనిపించినా కూడా ఇంతవరకూ తెలుగులో ఈ తరహాలో సినిమా రాలేదు అని చెప్పారు.
ఢిల్లీకి చెందిన కృతి శానన్‌ని హీరోయిన్ గా తీసుకున్నాం. ఈ కథకు కొత్తమ్మాయి అయితేనే కరెక్ట్ అని అన్నారు. ప్రస్తుతం లొకేషన్స్ ఎంపిక హడావిడిలో ఉన్న సుకుమార్ తన చిత్రం గురించి ఇలా పలు ఆసక్తికరమైన విషయాలు మీడియాకు తెలియచేసారు. చిత్రం పోగ్రెస్ తెలుపుతూ...ఇప్పటికి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యింది. జనవరి 16 నుంచి మూడో షెడ్యూలు మొదలవుతుంది. మే నెలకు మొత్తం వర్క్ పూర్తవుతుంది. సమ్మర్ తర్వాతే రిలీజ్ ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











