చరణ్.. నన్ను డామినేట్ చేస్తావా? నీ బాబును రా! చిరంజీవి వార్నింగ్.. తగ్గేదేలే అంటూ చెర్రీ సవాల్
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. 'ఖైదీ నెంబర్ 150' మూవీతో కమ్‌బ్యాక్ అయిన ఆయన.. అది సూపర్ హిట్ అవడంతో మరింత జోష్‌తో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే 'సైరా: నరసింహా రెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఇది వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీంతో ఇప్పుడు 'ఆచార్య'తో రెడీగా ఉన్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి, చరణ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఏముందో మీరే చూడండి!

మెగా హీరోల కలయికలో ఆచార్య
తన కొడుకు రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే.

అలాంటి కథతో... భారీ బిజినెస్
మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న మూవీ కావడంతో.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య'ను రూపొందించారు. చరణ్ ఓ మిషన్ కోసం చనిపోతే చిరంజీవి అతడి పనిని పూర్తి చేయడమే ఈ సినిమా నేపథ్యం అని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ కావడంతో ఈ సినిమాకు మంచి పోటీ ఏర్పడింది. దీంతో అన్ని ఏరియాల్లో భారీ స్థాయిలో బిజినెస్ కూడా జరుపుకుంది.

విడుదల తేదీ.. ట్రైలర్‌తో రికార్డ్స్
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీని ఎన్నో వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. దీనికి మెగా అభిమానుల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచీ భారీ స్పందన దక్కింది. ఫలితంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అలాగే అంచనాలు కూడా మరింత పెరిగాయి.
భలే భలే బంజారా సాంగ్ రెడీ
'ఆచార్య' మూవీ విడుదలకు సమయం ఆసన్నం అవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమలోని 'భలే భలే బంజారా' అనే పాటను విడుదల చేయబోతున్నారు. ఇందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాలో ఇదే హైలైట్ కాబోతుందని తెలుస్తోంది.

సర్‌ప్రైజ్ వీడియోతో సందడి
'భలే భలే బంజారా' పాట విడుదలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కోసం చిత్ర యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో పాటను చిరంజీవి, చరణ్‌కు కొరటాల శివ వినిపించాడు. ఇది విన్న తర్వాత వాళ్లిద్దరూ సంతృప్తి చెందినట్లు చెప్పారు. అప్పుడు కొరటాల 'ఈ పాట షూట్‌ను చూస్తానని చాలా మంది అడుగుతున్నారు' అంటూ హీరోలిద్దరికీ చెప్పాడు.

డామినేట్ చేస్తావా? తగ్గను కదా
''భలే భలే బంజారా' పాటలో చరణ్ నన్ను డామినేట్ చేస్తాడని భయంగా ఉంది. మొన్న తారక్‌తో కలిసి నాటు నాటు అంటూ ఇరగదీశాడు కూడా' అని అన్నారు. దీనికి చరణ్ 'మేము ఏం చేసినా మీరొచ్చి గ్రేస్ మూమెంట్ చేస్తే చాలు' అన్నాడు. ఇక, కొరటాల వెళ్లిపోయిన తర్వాత చిరు 'ఏరా నన్ను డామినేట్ చేస్తావా' అని చరణ్‌ను అడగ్గా 'అస్సలు తగ్గను' అని చెప్పాడు.


Click it and Unblock the Notifications











