Acharya Trailer review: చిరంజీవి, రాంచరణ్ అదుర్స్.. కొరటాల మ్యాజిక్ రిపీట్
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య ట్రైలర్ కోసం ఎదురు చూపులు ముగిసాయి. రాంచరణ్ కీలక పాత్రలో నటింంచిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్, ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

ఆచార్య మూవీకి అడ్డంకులు
ఆచార్య మూవీ విషయానికి వస్తే.. సైరా మూవీ రిలీజ్ అయిన వెంటనే చిరంజీవి స్వయంగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం అక్టోబర్ 19న లాంఛనంగా ప్రారంభమైంది. 2020 జనవరి నుంచి నిరవధికంగా షూటింగ్ జోరు మొదలైంది. అయితే కోవిడ్ రాకతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు.

టీజర్‌కు ఫుల్ రెస్పాన్స్
ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ నిరాశలో ఉన్న మెగా అభిమానులకు టీజర్ రూపంలో కొణిదెల ప్రొడక్షన్ సంతోషాన్ని నింపింది. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా నన్ను ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెబుతానేమో అంటూ చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన టీజర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

నీలాంబరి, లాహే లాహే పాటలకు
ఇక టీజర్ తర్వాత విడుదలైన రెండు పాటలకు సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. లాహే లాహే పాటకు, అలాగే నీలాంబరి సాంగ్‌కు భారీగా లైక్స్, వ్యూస్ రావడం ఓ రికార్డుగా మారింది. అలాగే సానా కష్టం పాటకు కూడా మంచి స్పందన లభించింది. లాహే లాహే పాటకు 115 మిలియన్లు, నీలాంబరి పాటకు మూడు మిలియన్ల వ్యూస్, సానా కష్టం పాటకు 27 మిలియన్ల వ్యూస్ రావడం తెలిసిందే.
ట్రైలర్‌పై ఓసారి లుక్కేయండి!
ఇలా భారీ అంచనాలు ఆచార్య మూవీపై ఉండటంతో ఇక ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటాయనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొన్నది. ఈ ట్రైలర్‌ను సోమవారం ఏప్రిల్ 12వ తేదీ 6 గంటల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ ట్రైలర్‌పై మీరే లుక్కేయండి..

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: చిరంజీవి, రాంచరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సోను సూద్, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, సంగీత, రెజీనా కసండ్రా తదితరులు
దర్శకత్వం, రచన: కొరటాల శివ
నిర్మాత: నిరంజన్ రెడ్డి
సినిమాటోగ్రఫి: తిరు
ఎడిటింగ్: నవీన్ నూలీ
సంగీతం: మణిశర్మ
బ్యానర్: కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2022-04-29


Click it and Unblock the Notifications











