చిరంజీవితో సినిమాకు ఎన్టీఆర్ నో.. కొరటాలకు షాకిచ్చిన యంగ్ టైగర్.. కారణం ఇదే!
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు మరో శకం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గతంలో కృష్ణ, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలు ఎక్కువ సంఖ్యలో కలిసి సినిమాల్లో నటించారు. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఆ మధ్యలో కనుమరుగైనా.. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని ఎన్టీఆర్ వదులుకోవడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్నది. ఇక వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ల హవా
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు హీరోలు ఓటేస్తున్నారు. రానా, ప్రభాస్ కలిసి నటించిన బాహుబలి బ్లాక్‌బస్టర్ కావడం, ఆ చిత్రం అందించిన ఉత్సాహంతో దర్శక ధీరుడు RRR చిత్రంతో మరో మల్టీస్టారర్ చిత్రాన్ని ఆరంభించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే జోష్‌లో మరిన్ని సినిమాలు మల్టీస్టారర్లుగా రాబోతున్నాయి. అందులో ఆచార్య మూవీ ఒకటి అనే విషయం తెలిసిందే.

ఆచార్యలో ఎన్టీఆర్‌కు ఆఫర్
ఇక RRR సినిమాలో నటిస్తున్న సమయంలో ఎన్టీఆర్‌కు జనతా గ్యారేజ్ లాంటి హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివ ప్రపోజల్ పెట్టారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆచార్య అనే సినిమాలో చిరంజీవితో కలిసి నటించే అవకాశం ఉందని ఆఫర్ ఇచ్చారు. ఈ చిత్రంలో యువ విద్యార్థి నాయకుడి పాత్రలో నటించమని కోరితే అందుకు నో చెప్పారనేది మీడియాలో నానుతున్న వార్త.

కొరటాల ఆఫర్‌ను తిరస్కరించిన ఎన్టీఆర్
మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టారర్ సినిమా అంటే ఏ హీరోనైనా ఎగిరి గంతేస్తాడు. కానీ ఎన్టీఆర్ ఆ సినిమాను తిరస్కరించడానికి బలమైన కారణం ఉంది. RRR సినిమా పూర్తయ్యేంత వరకు మరో సినిమాలో నటించవద్దనే ఒప్పందం కారణంగా ఎన్టీఆర్ వెనకడుగు వేశారు. ఆ తర్వాత రాంచరణ్ కూడా ఇదే కారణంతో వెనక్కి తగ్గారు.

మహేష్ బాబుకు చిక్కిన అవకాశం
ఇక ఎన్టీఆర్, రాంచరణ్ కొరటాల శివకు నో చెప్పడంతో ఆ అవకాశాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు వద్దకు వెళ్లింది. శ్రీమంతుడు లాంటి ఘనమైన విజయాన్ని అందించిన కొరటాల శివకు వెంటనే ఓకే చెప్పడం జరిగిందనేది ఇన్‌సైడ్ టాక్. ఈ చిత్రానికి సంబంధించిన షూట్‌లో మహేష్ జూన్ నుంచి పాల్గొంటారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా కోసం 30 రోజుల పనిచేసే మహేష్ బాబుకు దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
Recommended Video


ఎన్టీఆర్, చిరంజీవి మల్టీస్టారర్ అలా మిస్
ఇదిలా ఉంటే.. చిరంజీవి తర్వాత అంతటి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే ఎన్టీఆర్ పేరే ముందుగా చెప్పుకోవాలి. ఓ దశలో చిరంజీవి నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి సత్తా ఉన్న ఎన్టీఆర్.. చిరంజీవితో కలిసి నటిస్తే వెండితెర వైభవం ఎలా ఉంటుందనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో సాగుతున్నది.


Click it and Unblock the Notifications











