Acharya మళ్లీ మారిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక.. విజయవాడ కాదు.. ఎక్కడంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా విజయవాడలో ఒక ప్రముఖ కళాశాలలో జరుగుతుంది అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా ఈ ప్రీ రిలీజ్ వేడుక మరోసారి మారినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

షూటింగ్ పూర్తయి
సైరా నరసింహారెడ్డి విడుదల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమా చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్, పూజ హెగ్డే హీరోయిన్స గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే కరోన సహా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

అద్భుతమైన స్పందన
ఫిబ్రవరి నాలుగో తేదీన విడుదల చేయాలని అనుకున్నారు కానీ మళ్లీ వాయిదా వేసి మార్చి 29 వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. మార్చి 29 వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని భావిస్తున్న సినిమా యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. మార్చి 12వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన కూడా లభించింది.

విజయవాడ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్ లో
అయితే తొలుత ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరగవచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ విజయవాడ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్ లో ఈ వేడుక జరగబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కావడంతో అది జరిగే అవకాశాలు లేకపోలేదు అని భావించారు.

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులోనే జరగబోతోంది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరుగబోతోంది.

పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు
ఈ వేడుకకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు తాజా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన లేదు కానీ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా పలువురు మెగా కుటుంబానికి సంబంధించిన హీరోలు హాజరవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. శ్రీమతి కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











