ఆచార్య సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు మీరెన్నడు చూడని అతిపెద్ద సెట్.. ఖర్చు ఎంతంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కథానాకుడిగా రూపొందుతున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతోంది. ఇక సినిమా కోసం నిర్మాత రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడడం లేదట. సినిమాలో ఒక భారీ సెట్ ఒక సరికొత్త రికార్డ్ అని తెలుస్తోంది.

 ఆచార్య కోసం భారీ సెట్

ఆచార్య కోసం భారీ సెట్

అపజయం లేని కమర్షియల్ దర్శకుడు కొరటాల శివ మొదటి సారి మెగాస్టార్ చిరంజీవితోవర్క్ చేస్తున్న సినిమా కాబట్టి ఆడియెన్స్ లో అంచనాలుమాములుగా ఉండవు. అందుకేప్రతి ఫ్రేమ్ కూడా మంచి కిక్కివ్వాలని సరికొత్తగాఉండలనిప్లాన్ చేస్తున్నారు. ఇక ఇంతవరకుఇండియన్ సినిమా హిస్టరీలోఎవరు కూడా నిర్మించని అతిపెద్దసెట్ నుఆచార్య కోసం నిర్మిస్తున్నారట.

ఫైట్స్ అనే కాదు.. స్టెప్పులు కూడా

ఫైట్స్ అనే కాదు.. స్టెప్పులు కూడా

ఆచార్య సినిమా దేవాలయాలసంరక్షణ కోసం పోరాడే ఒక కామన్ మ్యాన్ కథ అని మొదటి నుంచి టాక్ అయితే వస్తోంది. ఇక చిరంజీవి రెండు విభిన్నమైన షేడ్స్ లలో

కనిపించబోతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి ఫైట్ చేయడమే కాకుండా పాటలో స్టెప్పులుకూడా వేస్తారట.

10ఎకరాల స్థలంలో..

10ఎకరాల స్థలంలో..

అసలు మ్యాటర్లోకి వస్తే సినిమా కథలో ఒక ప్రత్యేకమైన ఆలయపట్టణం సెట్ ను నిర్మిస్తున్నారట. ఈ భారీ సెట్ వెనుక ప్రముఖ తమిళ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ కృషి ఎంతగానో ఉందట. మొదట రూ.10కోట్ల ఖర్చుతోనేనిర్మించిమిగతాది గ్రీన్ మ్యాట్తో కవర్ చేసి ఆ తరువాత VFX తో మ్యానేజ్చేయాలనీ అనుకున్నారట. కానీ సినిమా కథకు ఎంతో ముఖ్యమైన సెట్ కావడంతోపూర్తిగా 20ఎకరాల స్థలంలోసెట్ ను నిర్మించినట్లు సమాచారం.

ఖర్చు ఎంతంటే..

ఖర్చు ఎంతంటే..

హైదరాబాద్ శివార్లలోనికోకాపేటలోనిర్మించిన ఈ సెట్ కోసం మొత్తంగా 20 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇంతవరకుఏ ఇండియన్ సినిమా కోసం ఈ స్థాయిలోసెట్ నిర్మాణం జరగలేదట. ఇక ఈ విలువైన సెట్ లో మెగాస్టార్ యాక్షన్ సీన్ తో పాటు రెజీనాతోఒక సాంగ్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంధీ. ఇక వచ్చేవారంసినిమాకు సంబందించినమరొక కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X