పవన్ కోసం ఆచార్య స్పెషల్ షో.. థియేటర్ మొత్తం బుక్ చేశామన్న మెగాస్టార్ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ రామ్ చరణ్ తేజ్, చిరంజీవి, కొరటాల శివలతో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ షో వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

భారీ అంచనాలతో

భారీ అంచనాలతో


మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారని ప్రచారం జరిగింది కానీ కాజల్ అగర్వాల్ పాత్ర పరిధి తగ్గిపోవడంతో ఆమె సీన్స్ అన్నీ తొలగించినట్లు తాజాగా కొరటాల శివ వెల్లడించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.

హరీష్ శంకర్ తో

హరీష్ శంకర్ తో


ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా కోసం అనేక రకాలైన ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.

Recommended Video

Acharya: అందుకే పవన్ ని ఈ సినిమాలోకి తీసుకోలేదు! - మెగాస్టార్ చిరంజీవి | Filmibeat
క్లారిటీ ఇవ్వలేదు

క్లారిటీ ఇవ్వలేదు


ఆ ఇంటర్వ్యూ తాజాగా విడుదలైంది. ఇంటర్వ్యూలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక స్పెషల్ షో ఏర్పాటు చేశామని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఒక థియేటర్ ని బుక్ చేశామని, కుటుంబం అంతా కలిసి అక్కడే సినిమా చూస్తామని వెల్లడించారు. కానీ ఏ థియేటర్ లో చూస్తారు? ఎప్పుడు చూస్తారు? అనే విషయం మీద మాత్రం చిరంజీవి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

దొరుకుతుందో లేదో

దొరుకుతుందో లేదో


అలాగే ఈ సినిమా కోసం వేసిన ధర్మస్థలి అనే ఒక ఊరి సెట్ గురించి కూడా మెగాస్టార్ చిరంజీవి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక పురాతన దేవాలయం, చుట్టూ కొండలు, నదులు, గూడేలు అన్నీ కలిసి ఉండే ప్రాంతం వెతకడం చాలా కష్టమని అలాంటి ప్రాంతం కోసం వెతికాము కానీ ఎక్కడా అది దొరకలేదు అని అన్నారు. అందుకే హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఒక భారీ సెట్ నిర్మించామని ఒకవేళ అసలైన లొకేషన్ లో చిత్రీకరించాల్సి వస్తే అసలు ఆ లొకేషన్ ఇప్పటికైనా దొరుకుతుందో లేదో అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇదే తొలిసారి

ఇదే తొలిసారి


భారతీయ సినీ పరిశ్రమలో ఒక 20 ఎకరాలలో ఒక సెట్ చేయడం ఇదే తొలిసారి అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. మొట్ట మొదటి సారి పూర్తి స్థాయిలో రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తూ ఉండటంతో మెగా అభిమానులు ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X