twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్, సుకమార్ మూవీ ‘ఆచార్య’ టైటిల్‌పై.... నిర్మాతల ఖండన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'ఆచార్య' అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర నిర్మాతలు ఈ వార్తను ఖండించారు. 'ఆచార్య' అనే టైటిల్ పెడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. త్వరలోనే టైటిల్ ఖరారు చేసి ప్రకటిస్తామని తెలిపారు.

    టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, టైటిల్ చాలా క్యాచీగా...త్వరగా జనాల్లోకి చొచ్చుకెళ్లేలా..... పవర్ ఫుల్ గా ఉండే దాని కోసం అణ్వేషిస్తున్నామని, త్వరలోనే టైటిల్ ఖరారు చేసి మీడియా ముఖంగా ప్రకటన చేస్తామని చిత్ర నిర్మాతలు అంటున్నారు.

    ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇటీవలే మహేష్-క్రితి సానన్ లపై సాంగ్ చిత్రీకరించారు. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌ బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

    మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలతో పాటు, సుకుమార్ సినిమాలోని ప్రత్యేక అంశాలను కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా మహేష్ బాబు గత చిత్రకంటే భిన్నమైన లుక్ తో ఈచిత్రంలో కనిపించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోలందరిలో అందగాడిగా పేరున్న మహేష్ ఈచిత్రంలో తన న్యూ లుక్‌తో ప్రేక్షకుల మతి పోగొట్టనున్నాడు.

    ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే...ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లు, దర్శకత్వం: సుకుమార్.

    English summary
    Acharya title not for Mahesh Babu: Responding to this, makers of the movie have clarified that 'Acharya' is not the tittle for the film and said that they are going to announce the tittle shortly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X