దటీజ్ మెగాస్టార్.. ఆచార్య ట్రైలర్ అరుదైన రికార్డు.. టాలీవుడ్ లో మొదటి స్థానంలో?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా ఎట్టకేలకు విడుదలవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం సినిమా యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ వారిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాక ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ లో ఒక రికార్డు సెట్ చేసినట్లు ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే

రామ్ చరణ్ ఎంట్రీ తో

రామ్ చరణ్ ఎంట్రీ తో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి చేస్తున్న మొట్టమొదటి పూర్తి స్థాయి చిత్రం ఆచార్య. భరత్ అనే నేను సినిమా తెరకెక్కించిన తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న తర్వాత కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తొలుత ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తారని ప్రచారం జరిగింది కానీ ఏమైందో ఏమో రామ్ చరణ్ తేజ్ ఈ ప్రాజెక్టు లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందు చిన్న పాత్ర అనుకున్నది కూడా రామ్ చరణ్ ఎంట్రీ తో పూర్తి స్థాయి పాత్ర గా మారిపోయింది

అనేక సార్లు వాయిదా

అనేక సార్లు వాయిదా

రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన కోసం ఒక హీరోయిన్ పాత్ర కూడా సృష్టించారు. అలా ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. రియల్ హీరో సోనూ సూద్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండగా ఇతర కీలక పాత్రలో టాలీవుడ్లోని నటీనటులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

 రికార్డు సెట్

రికార్డు సెట్

ఎట్టకేలకు ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లలోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేశారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు ఈ ట్రైలర్ విడుదల అయిన నాటి నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. అంతేకాక ఈ ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక రికార్డు సెట్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

టాప్ ట్రెండింగ్ లో

టాప్ ట్రెండింగ్ లో


మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయిక నేపధ్యంలో ఆచార్య నుంచి ఎలాంటి అంశాలని అయితే కోరుకుంటున్నారో అదే తరహా ఎమోషన్ యాక్షన్ అంశాలతో ట్రైలర్ ప్రేకుల ముందుకు వచ్చింది. దీంతో 'ఆచార్య' ఊపు మరింత రెట్టింపు అయింది. ఒక రకంగా ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ ఏ సినిమా సాధించని ఓ ఘనతను అందుకుంది.

24గంటల్లోనే 24 మిలియన్ వ్యూస్

24గంటల్లోనే 24 మిలియన్ వ్యూస్

ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలై 24గంటల్లోనే 24 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. తెలుగు చిత్రసీమలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్ గా ఈ సినిమా ట్రైలర్ నిలిచింది. ఫ్యాన్స్ అయితే విపరీతంగా లైక్స్, కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ను మరింత ట్రెండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X