Acharya Twitter Review. రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్ కేక.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆచార్య చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కొరటాల శివ టేకింగ్, పాటలు ఈ సినిమాపై క్రేజ్ పెంచాయి. దాంతో విడుదలకు ముందే ఈ సినిమా ఓ రెంజ్ పాపులారిటిని సాధించింది. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్స్ ఎలా ఉన్నాయంటే?
Recommended Video

బాస్ విశ్వరూపం
ఆచార్య సినిమా చూసి ఇప్పుడే వచ్చాను. ఎక్స్‌ట్రా షర్ట్ తీసుకెళ్లండి.. సెకండాఫ్ ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్, ఫైట్స్, పాటలు, క్లైమాక్స్‌లో బాస్ విశ్వరూపం మాములుగా ఉండదు. బట్టలు చించుకోవాల్సిందే. కొరటాల మార్క్ స్టోరి టెల్లింగ్ సూపర్ తప్పకుండా సినిమా హిట్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
సెకండాఫ్ చరణ్ కేక
ఆచార్య సినిమా ఫ్టస్ డే ఫస్ట్ షో చూశాను. ఫస్టాఫ్ ఎబో యావరేజ్. ఇంటర్వెల్ సీన్‌లో సిద్దా ర్యాంప్ అంతే. చిరు చరణ్ మధ్య సీన్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. సెకండాఫ్ చరణ్ కేక. మణిశర్మ బీజీఎం బాగుంది. ఓవరాల్‌గా సినిమా బ్లాక్ బస్టర్ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
తండ్రి కోడుకుల మధ్య సీన్లు
ఆచార్య మూవీ కొరటాల శివ మార్క్ సినిమా కాదు. సినిమాలో హై మూమెంట్స్ లేవు. తండ్రి కోడుకుల మధ్య సీన్లు అద్భుతంగా ఉన్నాయి. బీజీఎం, సినిమాటోగ్రఫి బాగున్నాయి. స్టోరీ వీక్, స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. ఫ్యాన్స్‌కు ఈ సినిమా పండుగే. నా రేటింగ్ 2/5 అని ట్విట్టర్‌లో నెటిజన్ కామెంట్ చేశాడు.
చిరంజీవి వింటేజ్ గ్రేస్
ఆచార్యలో చిరంజీవి వింటేజ్ గ్రేస్, యాక్టింగ్. సిద్దాగా రాంచరణ్ సెకండాఫ్‌ను తన భుజాల మీద మోశాడు. పాటలన్నీ కేక పెట్టించాయి. వీఎఫ్ఎక్స్ సరిగా లేవు. కొంచెం సాగదీసినట్టుగా ఫస్టాఫ్ ఉంది. ఐటెమ్ సాంగ్ మైనస్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్ మరో లెవెల్
ఆచార్య ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ కేవలం ఫ్యాన్స్ కోసమే. RRR తర్వాత రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్ మరో లెవెల్. కొన్ని ఎమోషనల్ సీన్లు కంటతడి పెట్టించేలా ఉంటాయి. ఓవరాల్‌గా ఫ్యాన్స్ స్టఫ్ మూవీ అని మరో నెటిజన్ ట్విట్టర్‌లో మెసేజ్ చేశాడు.
సెకండాఫ్‌లో ఫైట్స్, బీజీఎం
ఫస్టాఫ్ డీసెంట్, ఆర్డనరీగా ఉంది. సెకండాఫ్‌లో 40 నిమిషాలు ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్‌కు కేక. సెకండాఫ్‌లో ఫైట్స్, బీజీఎం, సాంగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. హిందూ ధర్మాన్ని గురించిన మెసేజ్ అద్బుతంగా ఉంటుంది. నా రేటింగ్ 3.5/5 అని నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇంటెర్వెల్ బ్యాంగ్ బ్లాస్టింగ్‌గా
ఆచార్య ఫస్టాఫ్ విషయానికి వస్తే.. చిరంజీవి ఎంట్రీ, సాంగ్స్ సూపర్. కొంత స్లో నేరేషన్ అనిపిస్తుంది. ఇంటెర్వెల్ బ్యాంగ్ బ్లాస్టింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో రాంచరణ్ చించేశాడు. ఫైట్లు, పాటలు, బీజీఎం, డైరెక్షన్ ఓ రేంజ్‌లో ఉంటాయి. చిరంజీవి ఎప్పటికీ మెగాస్టార్ అనిపించేంతగా ఉంది.
మిర్చి రేంజ్‌లో ఆచార్య
మిర్చి రేంజ్‌లో ఆచార్య సూపర్ హిట్. కొరటాల శివ ఖాతాలో మరో 100 కోట్ల మూవీ. ఇటీవల కాలంలో బెస్ట్ మాస్ మూవీ. మణిశర్మ బీజీఎం సూపర్ హిట్. ఈ వారాంతానికి మిక్స్‌డ్ రివ్యూలన్నీ సెటిల్ అవుతాయి. నా రేటింగ్ 4/5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆచార్య ఫస్టాఫ్ కూల్‌గా
ఆచార్య ఫస్టాఫ్ చాలా కూల్‌గా సాగిపోతుంది. సెకండాఫ్ ఫుల్ హైగా ఉంటుంది. సిద్దా రోల్ ఎంట్రీ తర్వాత నుంచి అన్నీ గూస్‌బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. మణిశర్మ బీజీఎం బాగుంది. భీమ్లా నాయక్ కంటే 5 రెట్లు ఎక్కువ ఇచ్చాడు. తండ్రి, కొడుకుల రచ్చ మాములుగా లేదు. నా రేటింగ్ 3/5 అని నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
మెగాస్టార్ అంటే అది అనే రేంజ్‌లో
ఫస్టాఫ్ అదిరిపోయేలా ఉంది. ఇది కద మెగాస్టార్ అన్నట్టు ఉంది. కేవలం ఫ్యాన్స్ కాదు.. నార్మల్ సినీ ప్రేక్షకుడికి హైమూమెంట్స్ ఉంటాయి. ఓ కామెడీ సీన్ వదిలేస్తే.. మిగితాది అంతా కేక. శివశంకర వరప్రసాద్ రీబూట్‌ను మిస్ చేసుకోవద్దు అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











