అచ్చిరెడ్డి కొడుకూ మొదలెట్టాడు
గతంలో కృష్ణారెడ్డితో అనేక సినిమాలు తీసిన అచ్చిరెడ్డి తాజాగా తన కుమారుడు నితీష్ ని పరిచయం చేస్తూ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. పి.బాలాజి అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం జూలై మూడు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అలాగే ఈ చిత్రానికి మనసా త్రుళ్ళిపడకే..అనే టైటిల్ డిసైడ్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ చిత్ర కథ కూడా టైటిల్ కి తగ్గట్లే టీనేజ్ కుర్రకారు..అలోచనలు..ప్రేమలు తిరుగుతుందని చెప్తున్నారు. ఇక అచ్చిరెడ్డి కొంతకాలంగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. తాజాగా ఈ బ్యానర్ లో తీసిన కిక్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
producer achi reddy sv krishna reddy son nitish hero balaji kick మనసా త్రుళ్ళిపడకే ఆర్ఆర్మూవీ మేకర్స్ కిక్ కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి నితీష్ బాలాజి


Click it and Unblock the Notifications