twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొజ్జాల స్పందన కోసం చూస్తున్నా

    By Srikanya
    |

    సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు తాను తన నియోజకవర్గానికి వెళ్లలేదని, అందువల్లే ఈ పాత్రపై కొజ్జాల నుంచి ఇంకా స్పందన రాలేదని అంటున్నారు శరత్ కుమార్.'కాంచన" చిత్రంలోని నపుంసకుడి పాత్రను ఓ చాలెంజ్‌గా తీసుకొని చేశానని చెప్తూ నటుడు శరత్‌కుమార్ ఇలా చెప్పారు.అలాగే తనకు ఆ పాత్ర స్వభావాలతో పరిచయముందని అంటూ.. 'నేను ఢిల్లీలో పుట్టిపెరిగాను. ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూసినా నపుంసకులుంటారు. సాయం కోసం వారు ఒక్కోసారి మా దగ్గరికి కూడా వస్తారు. నేనే కాదు. నటులంతా తమ పాత్రలను సమాజాన్ని పరిశీలించి చేస్తుంటారు" అని పేర్కొన్నారు.

    నిత్యం తారసపడే 'గే"లను చూసి వారి ప్రవర్తనను ఆ పాత్రలో ప్రదర్శించానే తప్ప ప్రత్యేక కసరత్తేమీ చేయలేదని శరత్‌కుమార్ తెలిపారు. అయితే షూటింగ్ తొలిరోజు అలా నటించడం కొంచెం కష్టంగానే అనిపించిందని, ఎట్టకేలకు విజయవంతంగా పాత్రలో ఒదిగిపోయానని వివరించారు. అలాగే ఈ సినిమా విజయం సాధించడం చాలా సంతోషం కలిగించిందని, భవిష్యత్‌లో ఇలాంటి మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    English summary
    The role in Kanchana is an unusual one. It was a challenging role. As an actor who has done a lot of movies and a number of characters, I always yearn to play challenging roles. This film had a great social message: Sarath Kumar
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X