నట కీచకుడు వినయ్ వర్మ అరెస్ట్.. బట్టలిప్పితేనే యాక్టింగ్‌లో శిక్షణ.. నిర్భయ కేసు

నట శిక్షకుడు, సినీ నటుడు వినయ్ వర్మ ఆగడాలకు తెరపడింది. నటనా శిక్షణ పేరుతో యువతులను వంచిస్తున్న కీచకుడి రాసక్రీడలకు తెర దించారు. బట్టలు విప్పలేదనే కారణంతో ఓ యువతిని క్లాస్ నుంచి బయటకు పంపారనే వార్త మీడియాలోను, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఈ కేసులో సూత్రధారి యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వివరాల్లోకి వెళితే..

లైంగికంగా వేధించాడనే ఆరోపణలు

లైంగికంగా వేధించాడనే ఆరోపణలు

భాదితురాలు మీడియాతో మాట్లాడుతూ.. వినయ్ వర్మ తనను లైంగికంగా వేధించాడు. ఏప్రిల్ 3న యాక్టింగ్ వర్క షాపులో జాయిన్ అయ్యాను. ఏప్రిల్ 15వ తేదీ వరకు యాక్టింగ్ క్లాసులు అంతా సవ్యంగా సాగాయి. ఓ రోజు గది తలుపు, కిటీకిలు మూసి బట్టలు విప్పేయమని బలవంతం చేశాడు. లైంగికంగా వేధించాడు అని ఆరోపణలు చేసింది.

 నిర్భయ చట్టం కింద కేసు నమోదు

నిర్భయ చట్టం కింద కేసు నమోదు

బాధితురాలు చేసిన ఆరోపణలు, నమోదు చేసిన కేసు ఆధారంగా నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు సూత్రధార్ నిర్వాహకుడు వినయ్ వర్మను మంగళవారం అదుపులోకి తీసుకొన్నారు. ఆయనపై నిర్భయం చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసును ఆధారంగా చేసుకొని ఈ కోణంలో మరింత విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

 పోలీసుల విస్తృత సోదాలు, దర్యాప్తు

పోలీసుల విస్తృత సోదాలు, దర్యాప్తు

ఏప్రిల్ 17న బాధితురాలు ఫిర్యాదును ఆధారంగా తీసుకొని యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో సోదాలు నిర్వహించారు. బాధితురాలి ఆరోపణలపై వినయ్ వర్మను ప్రశ్నించగా.. బట్టలు విప్పడం నటనలో భాగమని సమర్ధించుకొన్నారు. ఆమెకు అలా చేయడం ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోమన్నాను అని ఆయన సమర్ధించుకొన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

30 ఏళ్లుగా నట శిక్షణలో వినయ్ వర్మ

30 ఏళ్లుగా నట శిక్షణలో వినయ్ వర్మ

వినయ్ వర్మ సుమారు 30 సంవత్సరాల నుంచి థియేటర్, శిక్షణ రంగంలో ఉన్నారు. ఆయన పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. 20 సంవత్సరాల నుంచి ఆయన సూత్కధార్ అనే యాక్టింగ్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. గతంలో కూడా కొందరిని వేధించారని, అయితే బయటకు పొక్కకపోవడం గమనార్హం. తాజా ఉదంతంలో కొన్ని అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X