భద్రత లేదంటూ...మహేష్ హీరోయిన్ వ్యాఖ్యలు

సినిమా రంగంలో కెరీర్ సందేహాత్మకంగా, భద్రత లేకుండా ఉంటుందని....ఒక్కోసారి ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు అంటూ వేదాంతం వల్లిస్తోంది అమృత. 'సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాక జీవితంలో ఎన్నో ఆశ్యర్యాలు చోటు చేసుకుంటాయి. కెరీర్ మనం అనుకున్న విధంగా సాగదు. గత రెండు సంవత్సరాలుగా నేను సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేసాను. కానీ 2013 సంవత్సరం నా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి' అని అమృత చెప్పుకొచ్చింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికైతే నా జర్నీ సంతృప్తిగానే ఉంది. అలా అని ఎప్పుడూ ఇలాగే ఉంటుందనే నమ్మకం కూడా లేదంటోంది ఈ 31 ఏళ్ల సుందరి. ప్రస్తుతం తనకు అనేక ఆఫర్లు వస్తున్నా...అందులో తనకు నచ్చే విధంగా ఏమీ ఉండటం లేదని, సెలక్టివ్‌గా సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం చెబుతోంది.
ప్రస్తుతం అమృతరావు ప్రకాష్ ఝా దర్శకత్వంలో రూపొందుతున్న 'సత్యాగ్రహ' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్, అజయ్ దేవగన్, కరీనాకపూర్, మనోజ్ బాజ్ పాయ్, అర్జున్ రామ్ పాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు నీరజ్ ఓరా దర్శకత్వంలో హర్షద్ వర్షి హీరోగా రూపొందుతున్న హంగామె పే హంగామా అనే చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











