twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో రిలీజ్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్ 3డి' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది.

    ఈ కార్యక్రమానికి దర్శకులు శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరై సీడీలను విడుదల చేసారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన బప్పీ లహరి మాట్లాడుతూ....హైదరాబాద్ నాకు లక్కీ ప్లేస్, తెలుగులో నేను చేసిన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, సింహాసనం పెద్ద హిట్టయ్యాయి. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మా అబ్బాయి తెలుగు వారికి పరిచయం అవుతున్నారు. నాలాగే అతన్ని రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు.

    దర్శకుడు అనిల్ సుంకర మాట్లాడుతూ...ఎంతో ఇష్ట పడి, కష్టపడి చేసిన సినిమా ఇది. బప్పీ లహరితో సంగీతం సమకూర్చుకోవడాన్ని గ్రేట్ గా భావిస్తున్నాను. ఆడియో హిట్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ అనిల్ సుంకర ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేసారు. బప్పీ లహరి సంగీతం తప్పకుండా హిట్టవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్టయి దర్శకుడిగా అనిల్ సుంకరకి మంచి పేరు తెస్తుంది అన్నారు.

    అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో రిలీజ్ (ఫోటోలు)

    యాక్షన్ 3డి ఆడియో విడుదల కార్యక్రమం దృశ్యం

    అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో రిలీజ్ (ఫోటోలు)

    యాక్షన్ 3డి ఆడియో విడుదల కార్యక్రమం దృశ్యం

    అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో రిలీజ్ (ఫోటోలు)

    ఆడియో వేడుకలో ఉదయ్ కిరణ్, సుకుమార్, బోయపాటి శ్రీను

    అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో రిలీజ్ (ఫోటోలు)

    బప్పీ లహరితో హీరోయిన్లు షీనా, స్నేహా ఉల్లాల్

    అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో రిలీజ్ (ఫోటోలు)

    బప్పీ లహరి

    అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో రిలీజ్ (ఫోటోలు)

    షీనా హాట్ అండ్ సెక్సీ లుక్

    అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో రిలీజ్ (ఫోటోలు)

    స్నేహా ఉల్లాల్ హాట్ లుక్

    మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

    English summary
    Action 3D Audio Launch held at Prasads Multiplex in Hyderabad. Allari Naresh, Uday Kiran, Sneha Ullal, Sheena Shahabadi, Isha Talwar, Vaibhav Reddy, Director Anil Sunkara, Singer Bappi Lahiri, Nassar and Others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X