For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో రిలీజ్ వాయిదా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    ఈ చిత్రం ఆడియో ఏప్రిల్ 20న విడుదలవ్వాల్సి ఉండగా.... ఏప్రిల్ 22కు వాయిదా పడింది. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌లో ఆడియో వేడుక జరుగనుంది. మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

    English summary
    Action 3D audio postponed to April 22. The film directed by Anil Sunkara. The film, which will be made in Telugu and Tamil, features an ensemble cast of Allari Naresh, Shaam, Vaibhav, Raju Sundaram, Kamna Jethmalani, Sneha Ullal and Neelam Upadhyaya in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X