అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఆడియో ట్రాక్ లిస్ట్
హైదరాబాద్: అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఏప్రిల్ 22 విడుదల చేయనున్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌లో ఆడియో వేడుక జరుగనుంది.
బప్పా-బప్పీ లహరి సంగీం అందిస్తున్న ఈచిత్రానికి సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్ట్ విడుదలైంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం...
1. సండే మండే
రచన : రామ జోగయ్యశాస్త్రి
గానం : రంజిత్, సుచరిత
2. ప్రెట్టీ గర్ల్
రచన : సిరాశ్రీ
గానం : రఘు కుంచె
3. ఊలాలా ...
రచన : రాజమ జోగయ్య శాస్త్రి
గానం : బప్పీ లహరి
4. డింగ్ డాంగ్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : ప్రియా హిమేష్, చిన్ని చరణ్
5. స్వాతి ముత్యపు జల్లులలో...(ప్రేమ యుద్దం సినిమాలోని రీమిక్స్ సాంగ్)
రచన : వేటూరి, హంసలేఖ
గానం : కార్తిక్, దివిజ
6. మమసితా..
రచన : భావన చంద్ర
గానం : బప్పా లహరి
మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications











