అల్లరి నరేష్ ‘యాక్షన్’ 3డి చిత్రం విశేషాలు
ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇక్కడ దర్శకుడు అనిల్ సుంకర క్లైమాక్స్ కు ముందు వచ్చే సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈచిత్రం నెక్ట్స్ షెడ్యూల్ అక్టోబర్ 19 నుంచి బ్యాంకాక్ లో ప్రారంభం కానుంది. దర్శకుడు అనిల్ ఈచిత్రం గురించి చెబుతూ... తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం రెండు నెటివిటీలకు దగ్గరగా ఉంటుందని, వేర్వేరుగా చిత్రీకరిస్తున్నామన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ... సరికొత్త 3డి వెర్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమ యూనిట్‌కు మంచి పేరు తీసుకువచ్చేలా ఉంటుందని తెలిపారు. తండ్రీతనయులు బప్పా, బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ఓ విశేషం. రీరికార్డింగ్‌తో పాటు తమన్ ఓ పాటకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications












