జూన్ 14న అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ గ్రాండ్ రిలీజ్
హైదరాబాద్: అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈచిత్రం జూన్ 14వ తేదీన విడుదలకు సిద్దం అవుతోంది. ఈ చిత్రం 2డి తో పాటు 3డిలోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్‌కు వెళ్లనుంది. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారతీయ సినీ రంగ చరిత్రలో 3డిలో రూపొందిన తొలి కామెడీ చిత్రం ఇదేకావడం విశేషం.
అల్లరి నరేష్ సినిమా అంటే....కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు, టైమింగ్ తో కూడిన పంచ్ డైలాగులు మాత్రమే ఉండేవి ఒకప్పుడు. రాను రాను అల్లరి నరేష్ సినిమాలు పంథా మారుతున్నాయి. పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తోడవుతున్నాయి. ఈ మధ్య వచ్చిన పలు సినిమాల్లో డాన్సుల విషయంలోనూ తనదైన మార్కు చూపించిన నరేష్...తాజాగా శృంగార రసాన్ని కూడా ప్రేక్షకులపై ఒలికించ బోతున్నాడు.
యాక్షన్ 3డి' చిత్రంలో చిత్రీకరించిన ఓ సాంగు......దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాలను గుర్తు తెచ్చాయి. హీరోయిన్ బొడ్డుకు రకరకాల పండ్లు, పూలతో టచ్చింగులు, పాలతో హీరోయిన్ అందాలను తడిపేయడం లాంటి సీన్లతో ఈ సాంగు శృంగార రసాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు మరింత కిక్ ఇవ్వనుంది.
సెనీల్, పోసాని ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications











