యాక్షన్ 3డి : సెకండాఫ్‌లో చెత్తసీన్లు కట్ కట్

By Bojja Kumar

హైదరాబాద్ : అల్లరి నరేష్ హీరోగా అనిల్ సుంకర దర్శకత్వంలో రూపొందిన 'యాక్షన్' 3డి చిత్రం నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ సినిమా కదా...కామెడీ ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. తొలి ప్రయత్నంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు.

సెండాఫ్‌లో కొన్ని సీన్లు బోరింగ్‌, చెత్తగా ఉండటంతో....సినిమాను రక్షించుకునే ప్రయత్నంలో పడ్డ దర్శక నిర్మాతలు కొన్ని సీన్లను కత్తిరించాలని డిసైడ్ అయ్యారు. దీంతో సెకండాఫ్‌లో సినిమా దాదాపు 15 నిమిషాల పాటు ట్రిమ్ చేయబడింది. మరి ఈ కత్తిరింపుల వ్యవహారం సినిమాకు ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి.

అల్లరి నరేష్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందించారు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించారు.

ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రం. ఈ చిత్రానికి కెమెరా : సర్వేష్ మురారి, 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X