రామ్ లో కరెంట్ ఉంది: యాక్షన్ హీరో అర్జున్
రామ్ చూడటానికి చాక్లెట్ బోయ్‌లా కనిపిస్తాడు కానీ అతనిలో కరెంట్ ఉంది. రామ్ గత చిత్రాలను చూసి తన ఫ్యాన్‌ని అయిపోయాను అంటున్నారు మరో హీరో అర్జున్. రీసెంట్ గా 'దిల్' రాజు నిర్మించిన చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ' సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. అందులో భాగంగా కలిసిన మీడియాతో అర్జున్ ఇలా సంభాషించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ...నేను కూడా ఇదే వయసులో హీరో అయ్యాను. కానీ ఈ స్థాయిలో మాత్రం పెర్ ఫామ్ చేయలేదు. కాకపోతే నా ఫైట్స్ బావుంటాయని అందరూ అనేవారు. ఏది ఏమైనా రామ్ భవిష్యత్తులో గొప్ప హీరోగా ఎదుగుతాడు అని నమ్మకం వ్యక్తం చేశారు అర్జున్.
అలాగే దిల్ రాజు గురించి అర్జున్ మాట్లాడుతూ-"డా.డి.రామనాయుడు, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్స్ దగ్గర సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ దిల్ రాజులో కూడా చూశా. సినిమా కోసం తపించే నిర్మాత ఆయన. అలాంటి నిర్మాతకు సక్సెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అన్నారు. అనంతరం రామ్ మాట్లాడుతూ...అర్జున్ ఈ సినిమాకు అయిదవ పిల్లర్ లాంటి వారని, ఇద్దరు తెలుగు అమ్మాయిలతో చేయడం వల్ల తొలిసారి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని చెప్పారు. అర్జున్ ప్రత్యేక పాత్రలో...రామ్, ప్రియా ఆనంద్, బిందు మాధవి హీరో, హీరోయిన్లుగా శ్రీవాస్ దర్శకత్వంలో 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.


Click it and Unblock the Notifications











