twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్‌బోర్డ్‌ను మూసేయడం మంచిది : హీరో అర్జున్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'విశ్వరూపం' వివాదంపై స్పందిస్తూ... కొత్త విషయాలు ఎప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయని, అయితే వాటి మంచి చెడులు నిర్ణయించాల్సింది సెన్సార్‌బోర్డ్ మాత్రమేనన్నారు. ప్రభుత్వాలు నిషేధం విధించే పనైతే ఇక సెన్సార్‌బోర్డ్‌ను మూసేయడం మంచిదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సినిమా నిర్మించే నిర్మాత, అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోతే తద్వారా వచ్చే నష్టానికి బదులెవరు చెబుతారని యాక్షన్ హీరో అర్జున్ ప్రశ్నించారు.

    ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ వివిధ అంశాలపై మాట్లాడారు. 'ఒకరిద్దరు నిర్మాతలు వందలాది థియేటర్లును లీజుకు తీసుకుని పూర్తిగా తమ అధీనంలో పెట్టుకోవడం అంత క్షేమకరమైన విధానం కాదు. ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అయితే ప్రస్తుత రోజుల్లో సినిమా తీసిన నిర్మాత తన పెట్టుబడి ఫలితాన్ని వీలైనంత త్వరగా పొందాలని ఆశించడం కూడా పొరపాటేమీ కాదు' అన్నారు.

    'హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు బాధను కలిగించాయి. ఇలాంటి సమయంలోనే నాయకులు ఏం చేస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. మనం ఓట్లేసి గెలిపించిన వారు బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటివి పునరావృతం కావు' అన్నారు హీరో అర్జున్. మన సినిమాల స్థాయి హాలీవుడ్ కంటే కనీసం 25 ఏళ్లు వెనుకబడి ఉందన్నారు.

    తన తాజా ప్రాజెక్టుల గురించి చెప్తూ....త్వరలోనే తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో పల్లెటూరి నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నానని... 'సీఎం' పేరుతో స్వీయ దర్శకత్వం లో తీస్తున్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. సినిమాలు సమాజంలో సమస్యల్ని మాత్రమే కాదు... పరిష్కారాలను కూడా చూపాలని, ఆ కోవలోనే 'సీఎం' సినిమా రూపొందుతోందన్నారు. సీఎం సినిమాను డీటీహెచ్‌లో విడుదల చేస్తారా అన్న ప్రశ్నకు ఇప్పుడే చెబితే ఎలా అని నవ్వుతూ అన్నారు.

    English summary
    Arjun responding to media about Bomb Blasts and Viswa Roopam Issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X