Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్.. హీరోయిన్ ఎవరంటే?
చేసింది కొన్ని సినిమాలే అయినా విశ్వక్ సేన్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నూమాదాస్' వంటి సినిమాలతో టాలీవుడ్లో విశ్వక్ సేన్ ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. థానే దర్శకుడిగా మారి చేసిన 'ఫలక్ నూమాదాస్' సినిమా మంచి హిట్ కొట్టడంతో క్రేజీ హీరోగా మారాడు. ఆ తర్వాత శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ చిత్రంతో మరో సక్సెస్‌ని అందుకున్నారు. గతేడాది పాగల్‌తో ప్రేక్షకులకు తనలోని రొమాంటిక్ టచ్ ను పరిచయం చేసినా ఆ సినిమా హిట్ కాలేక పోయింది. అయితే ఆయన ఈ ఏడాది 'అశోకవనంలో అర్జున కళ్యాణం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మే నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో నటించి విశ్వక్ సేన్ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలు లైన్లో పెట్టిన విశ్వక్ సేన్ ఇప్పుడు తన 11వ సినిమాను కూడా ప్రకటించారు.
అయితే ఈ సినిమాకు ఒక విశేషం ఉందండోయ్ అదేమంటే ఈ సినిమాను కన్నడ స్టార్, యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేయడంతో పాటు తన బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. అలాగే కథ కూడా స్వయంగా అర్జునే అందించడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. శ్రీ రామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.15గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని అంటున్నారు.
మరో క్రేజీ విషయం ఏంటంటే.. అర్జున్ కూతురు ఐశ్వర్యను కూడా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాతోనే పరిచయం చేస్తున్నారని అంటున్నారు. అర్జున్ డైరెక్షన్ లోనే ఆయన కూతురు హీరోయిన్ గా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండటం గమనార్హం. విశ్వక్ సేన్ తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే 'గామి, అక్టోబర్ 31 లేడీస్ నైట్, ఓరి దేవుడా, దాస్ కా దమ్కీ, ముఖ చిత్రం అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల్లో కొన్నింటి షూటింగ్ పూర్తి చేసిన విశ్వక్, మిగతా వాటి షూటింగ్ ని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా 'విశ్వక్ సేన్ 11'వ చిత్రంపై అనౌన్స్ మెంట్ ఇచ్చి అభిమానులు, ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేశారనే చెప్పాలి.