రవితేజ దండయాత్ర షురూ..: 'టచ్ చేసి చూడు' టీజర్ అదిరింది..(వీడియో)
Recommended Video

మాస్ మహారాజా రవితేజ నుంచి ఆయన బిరుదుకు సరితూగే సినిమా ఏది ఇటీవలి కాలంలో రాలేదు. 'రాజా ది గ్రేట్' అంటూ గతేడాది ప్రేక్షకులకు ముందుకు వచ్చినా!.. ఆ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టలేదన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు ఆ లోటును తీర్చేలా 'టచ్ చేసి చూడు'తో మాస్ అంటే ఏంటో మరోసారి నిరూపించాలనుకుంటున్నాడు రవితేజ. తాజాగా విడుదలైన టీజర్ కూడా అందుకు తగ్గట్లు గానే ఉంది.

విడుదలైన టీజర్..:
నల్లమలుపు బుజ్జి నిర్మాణంలో బేబీ భవ్య క్రియేషన్ బ్యానర్‌పై, రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ తెరకెక్కిస్తున్న సినిమా 'టచ్ చేసి చూడు'. సినిమా టీజర్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. అభిమానులు రవితేజ నుంచి ఎలాంటి పాత్ర కోరుకుంటున్నారో.. అందుకు న్యాయం చేసేలా హీరో క్యారెక్టర్ తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

టీజర్ అదిరింది..:
రవితేజను పవర్ ఫుల్ మ్యాన్‌గా చూపిస్తూ టీజర్ కట్ చేశారు. ప్రత్యర్థుల మీదకు దండెత్తినట్లుగా రవితేజ విరుచుకుపడటం.. ఏమాత్రం తగ్గని యాంగ్రీనెస్, యాక్షన్ సీక్వెన్స్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. తొలి సినిమానే అయినప్పటికీ.. దర్శకుడు విక్రమ్ సిరికొండ పిక్చరైజేషన్ ఆకట్టుకునేలా ఉంది.

రిలీజ్ ఎప్పుడు?:
నిజానికి 'టచ్ చేసి చూడు' సినిమాను జనవరి 26నే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ కొన్ని ప్యాచ్ వర్క్స్ మిగిలిపోయి ఉండటం.. పైగా ఆరోజే బోలెడన్ని సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటంతో 'టచ్ చేసి చూడు' విడుదలను నిర్మాతలు వాయిదా వేశారు. ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
హిట్టుపై కాన్ఫిడెన్స్..:
'టచ్ చేసి చూడు' ఔట్ పుట్‌పై చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రాజా ది గ్రేట్ తో ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఆ ఫామ్ ను నిలబెట్టుకుంటాడని అంటున్నారు. అంతేకాదు, మాస్ మహారాజా బిరుదుకు జస్టిఫికేషన్ చేసేలా సినిమా ఉండబోతుందట.
సినిమాలో రాశీఖన్నా, సీరత్ కపూర్‌లు రవితేజ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రీతమ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











