యువ నటుడిపై ఎన్టీఆర్ ఫాన్స్ ఫైర్.. కారణం ఇదే!
యువ నటుడు ఆదర్శ్ బాలకృష్ణ పలు చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో కూడా చిన్న పాత్ర పోషిస్తున్నాడు. చిన్న పాత్ర అయినప్పటికీ కీలకమైనది. ఈ విషయాన్ని తెలియజేస్తూ త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ చిత్రంలో నటించాలనే తన కల సాకారం అయిందని ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించాడు.
కాగా ట్విట్టర్ లో ఆదర్శ్ పోస్ట్ పై ఎన్టీఆర్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సర్ అని సంభోదించిన అదుర్స్ ఎన్టీఆర్ ని అలా ప్రస్తావించలేదు. ఎన్టీఆర్ ట్యాగ్ ని కూడా తప్పుగా చేశాడు. కనీసం గారు అని కానీ సర్ అని కానీ ఎన్టీఆర్ ని సంభోదించలేదని ఫాన్స్ మండి పడుతున్నారు.

సోషల్ మీడియా వేదికగానే ఎన్టీఆర్ ఫాన్స్ అదుర్స్ అపి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ దర్శత్వంలో రూపొందుతున్న అరవింద సమేత చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











