ఆది బ్యాచిలర్ లైఫ్‌కి ఈరోజే ఆఖరి రోజు...
హైదరాబాద్: టాలీవుడ్ లవ్లీ రాక్ స్టార్ ఆది బ్యాచిలర్ జీవితానికి నేటితో ఆఖరి రోజు. రాజమండ్రికి చెందిన అరుణతో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబరు 13న హైదరాబాద్‌లో ఆది-అరుణల వివాహాం జరుగబోతోంది. ఈ సందర్భంగా ఆది ఓ పత్రికతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు
‘కొందరేమో అప్పుడే పెళ్లేంటి? అన్నారు. మరికొందరు కరెక్టు టైమ్ కి భలేగా చేసుకుంటున్నావ్ అన్నారు. ఈ రెండు మాటలను తూకం వేసుకుని నాన్నకు ఓ మాట చెప్పాను. నాన్న...నీ మాటే నా మాట అన్నారు. వెంటనే అరుణకి ఓకే చెప్పాను. హ్యాపీగా ఏడడుగులు వేయడానికి సిద్దమయ్యాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి' అని వ్యాఖ్యానించారు.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరుణతో ఇటివలే నిశ్చితార్ధం జరిగిన ఆదికి డిసెంబర్ 13న హైదరాబాద్ లో జరుగుతుంది. ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన నిశ్చితార్ధ వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులను కూడా పిలవడం కుదరలేదు. చాలా గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్ 13న జరిగే పెళ్ళికి మాత్రం అందరిని ఆహ్వానిస్తున్నాను అని ఆది అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అరుణ తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులేనని ఆది అన్నాడు. హీరోగా తెరంగేట్రం చేసి, 'ప్రేమ కావాలి', 'లవ్‌లీ' విజయాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు ఆది. ఇప్పుడు తన జీవితంలో మరో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











