6.4 అంగుళాల ఎత్తు.. వాట్ ఏ హ్యాండ్సమ్.. అఖిరా నందన్‌పై ప్రశంసలు
Recommended Video
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాజీ భార్య రేణుదేశాయ్ కుమారుడు అఖిరా నందన్ ఊహించని విధంగా మారిపోయాడు. ఎత్తు, ఆకారంతో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే విధంగా స్టయిలీష్‌గా తయారయ్యాడు. గతంలో రేణుదేశాయ్ షేర్ చేసిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా అఖిరా నందన్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అలా వైరల్ కావడానికి కారణం హీరో అడివి శేషు. ఇంతకు అడివి శేషు ఏం చేశారంటే..

పవన్ పిల్లలతో అడివి శేషు
ఇటీవల కాలంలో అడివి శేషు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. క్షణం, గూఢచారి సినిమాలతో ప్రేక్షకుల నాడిని పట్టుకొని సక్సెస్ మంత్రాన్ని చేజిక్కించుకొన్నాడు. తాజాగా ఎవరు అనే చిత్రంతో వచ్చిన అడివి శేషుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నాడు. ఈ సినిమా పవన్ కుమారుడు అఖిరా నందన్ విపరీతంగా ఆకట్టుకొందంట. శేషును ఆ విషయం తెలియగానే పవన్ కల్యాణ్ పిల్లల వద్ద వాలిపోయి ఎంజాయ్ చేశారు.

లంచ్ డేట్‌తో
పవన్ కల్యాణ్ పిల్లలతో ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకొన్నారు. అఖిరా నందన్‌ను ఉద్దేశించి.. హ్యండ్సమ్ అబ్బాయితో ఓ రోజు గడిపాను. ఎవరు సినిమా అఖిరాకు చాలా నచ్చింది. ఆ మాట విని నేను ఫ్లాట్ అయిపోయాను. దాంతో లంచ్ కోసం వారితో కలిశాను. ఆ సందర్భంగా లైఫ్ గురించి మాట్లాడుకొన్నాం అని అడివి శేషు ట్వీట్‌లో పేర్కొన్నారు.

మామూలు హైటా అదీ..
నాకు అఖిరాలో నచ్చింది ఆయన హైట్. 6.4 అంగుళాల ఎత్తు. గంభీరంగా ఆకట్టుకొనే వాయిస్. అఖిరా ఇంకా ఎందుకు నచ్చాడంటే.. మా ఇద్దరిది ఎడమచేతి వాటం. మా ఇద్దరి అభిరుచుల్లో చాలా విషయాలు కలిసేలా ఉండటంతో అఖిరా అంటే చెప్పలేనంత ఇష్టం కలిగింది అంటూ అడివి శేషు తన ట్వీట్‌లో వెల్లడించారు.

పంజాలో పవన్ కల్యాణ్‌తో
ఇక అడివి శేషు గురించి చెప్పాలంటే.. పవన్ కల్యాణ్ నటించిన పంజా చిత్రంలో ఆయన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఇదిలా ఉంటే అఖిరా సినీరంగం ఎంట్రీ ఎప్పడెప్పుడా అని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అఖిరా ఎంట్రీ ఎప్పుడన్నది కాలమే నిర్ణయిస్తుందనే సినీ వర్గాల అభిప్రాయం.


Click it and Unblock the Notifications











