ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు ఆహుతి ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆయన్ను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు వివిధ రకాల టెస్టులు చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
క్రిష్ణా జిల్లా ముదినెపల్లి పక్కనున్న కోడూరు గ్రామానికి చెందిన ఆహుతి ప్రసాద్ తెలుగులో చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగారు. విలనిజం పండించడంలోనూ, హాస్యం పండించడంలోనూ ఆయనది అందెవేసిన చేయి. చందమామ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్నారు.



Click it and Unblock the Notifications











