ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన్ను ఒకసారే కలిశాను.. అజయ్ కామెంట్స్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ అంటే అందరూ గుర్తు పట్టకపోవచ్చు గానీ.. విక్రమార్కుడు చిత్రంలో టిట్లా, పోకిరి చిత్రంలో అజయ్ అంటే ఇట్టే గుర్తు పడతారు. విలనిజం అయినా కామెడీ అయినా ఎమోషన్ అయినా ఇట్టే పలికించగల నటుడు అజయ్. సారాయి వీర్రాజు అంటూ ఆ మధ్య హీరోగానూ ప్రయత్నాలు చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే సెటిలైన అజయ్ తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

అజయ్ ప్రస్తుతం చిరంజీవి కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్నట్టు తెలిపాడు. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను వెల్లడించాడు. ఇష్క్ సినిమా చూశాకా రాజమౌళి, రమా గారు ప్రశంసిన విధానం, అన్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా చిరంజీవి గారితో పనిచేయాలన్న కల ఇన్నాళ్లకు నెరవేరిందని అన్నాడు.

Actor Ajay About Chiranjeevi And Acharya Movie

'ఆచార్య' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాను. నిజం చెప్పాలంటే 20 ఏళ్ల నా కెరీర్‌లో ఆయన్ను ఒకసారి కలిశాను.. మళ్లీ ఆచార్య సెట్‌లో కలిశాను. ఆయనతో రెండు రోజుల షూటింగ్ మాత్రం జరిగింది. అంతలోపే లాక్ డౌన్ వచ్చింది. సెట్లో చిరంజీవిగారిని కలుసుకున్నప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఇన్నేళ్ల నా కెరియర్లో అంతకుముందు ఆయనను ఒకసారి మాత్రమే చూశాను. నన్ను ఆయన చాలా ఆప్యాయంగా పలకరించారు. నా సినిమాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు కలిగిన ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేనన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X