For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హోటల్ లో గిన్నెలు కడిగాను.. 22 ఏళ్లుగా అదే చేశా.. విలన్ గా మెప్పించిన అజయ్ కామెంట్స్

  |

  తనదైన నటన, విలనిజంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు నటుడు అజయ్. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ల నుంచి కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత చిన్న చిన్న నెగెటివ్ రోల్స్ చేసిన అజయ్ ఒక్కసారిగా తన పవర్ ఫుల్ విలనిజంతో ఎంతో ఆకట్టుకున్నాడు. అయితే చేతినిండా బిజీగా ఉండే అజయ్ కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అజయ్ సినిమాలకు గ్యాప్ తీసుకోడానికి గల కారణాలు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

  ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం..

  ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం..

  సహాయ నటుడిగా పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు అజయ్. స్నేహితుడిగా, అన్నయ్యాగా, విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్ లో అనేక సినిమాల్లో నటించి మెప్పు పొందాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశముదురు, ఇష్క్, భలే భలే మగాడివోయ్ వంటి తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్.

   హీరోలకు సమానమైన..

  హీరోలకు సమానమైన..

  సుమారు 22 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న అజయ్.. కథానాయకులకు సమానమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సూపర్ సక్సెస్ ఫుల్ గా నడిచిన అజయ్ కెరీర్ గత కొంతకాలంగా సరిగా లేనట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఎప్పుడూ చేతినిండా ఫుల్ సినిమాలతో బిజీగా ఉండే అజయ్ ఈ మధ్య కాలంలో తెరపై కనిపించింది చాలా తక్కువ.

   9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా..

  9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా..

  సినిమాలే కాకుండా ఎలాంటి ఈవెంట్లలో కనిపించలేదు. ఆ మధ్య డ్యాన్స్ షో కనిపించి సుధీర్ ను ఆటపట్టించినట్లు గుర్తు. కానీ చాలా కాలం తర్వాత ఇటీవల వచ్చిన 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో దర్శనమిచ్చి అలరించారు. అయితే ఇటీవల ఇచ్చిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండటంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  22 సంవత్సరాలుగా..

  22 సంవత్సరాలుగా..

  ''నేనేప్పుడూ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటించాను. గత 22 సంవత్సరాలుగా అదే చేస్తున్నాను. ఇక తర్వాత రోజుల్లో కూడా అలాగే నటిస్తాను. సినిమాల్లో మన పాత్ర ఎంత సేపు ఉంది.. ఎన్నిసార్లు కనిపించింది.. అని కాకుండా ఎంత ప్రభావంతంగా ఉందనేది పరిగణలోకి తీసుకుంటాను.

   ఇంట్లో నుంచి పారిపోయి..

  ఇంట్లో నుంచి పారిపోయి..

  ఇక ఇన్నాళ్లు ఎందుకు సినిమాలకు గ్యాప్ వచ్చిందంటే.. నాకు తగిన, నచ్చిన పాత్రలు లభించలేదు. అందుకే మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. నేను 19 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి పారిపోయి నేపాల్ వెళ్లిపోయాను. అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు నా దగ్గర డబ్బులు లేవు. దీంతో అక్కడి హోటల్లో గిన్నెలు కడిగాను. దాంతో వచ్చిన డబ్బుతో తిరిగి ఇంటికి వెళ్లాను'' అని తెలిపాడు అజయ్.

  అందరిముందు రేప్ సీన్..

  అందరిముందు రేప్ సీన్..

  అలాగే సినిమాల్లో తన విలన్ పాత్రల గురించి చెబుతూ ''శ్రీమహాలక్ష్మి చిత్రం టైమ్ లో ఒక ఘటన జరిగింది. ఒక మోడల్ ను రేప్ సీన్ అని చెప్పకుండా తీసుకువచ్చారు. నేను వెళ్లి చేయిపట్టుకోగానే ఆమె గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. దాంతో నేను ఆ సన్నివేశం చేయలేను అని చెప్పేశాను. నిజానికి అందరిముందు రేప్ సీన్ చేయడం చాలా చిరాకుగా ఉంటుంది. ఇక ఈ మూవీ తర్వాత మళ్లీ నాకు అలాంటి సన్నివేశాలు చేసే అవకాశం రాలేదు. అందుకు చాలా సంతోషిస్తాను'' అని చెప్పుకొచ్చాడు అజయ్.

  English summary
  Tollywood Actor Ajay Interesting Comments About His Film Career Villain Roles In Movies
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X