»   » సూర్య ‘24’పై అజయ్ భారీ ఆశలు...!

సూర్య ‘24’పై అజయ్ భారీ ఆశలు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్యారెక్టర్ ఏదైనా సరే తనదైన నటనతో పాత్రకు ప్రాణం పోయగల అతికొద్ది మంది తెలుగు నటుల్లో అజయ్ ఒకరు. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి సపోర్టింగ్ రోల్స్ మొదలుకొని విలన్ క్యారెక్టర్స్ వరకూ అన్ని పాత్రల్లోనూ మెప్పించాడు.

Actor Ajay Plays a Key Role in Suriya Starring24

తాజాగా అజయ్ తమిళ-తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైంటిఫిక్ థ్రిల్లర్ "24"లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు. "ఇష్క్"లో అజయ్ నటనకు ఫిదా అయిపోయిన దర్శకుడు విక్రమ్ కుమార్ "24" సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం అజయ్ ను ఏరికోరి ఎంపిక చేసుకున్నాడు. సినిమా మొత్తం దాదాపుగా సూర్యతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ లో అజయ్ కనిపించనున్నాడు. "24" చిత్రం తనకు నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తీసుకురావడంతోపాటు.. ఆత్మా సంతృప్తినిచ్చే చిత్రమని అజయ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.

Actor Ajay Plays a Key Role in Suriya Starring24

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ‘24' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత హీరోగా నటింస్తుండగా... మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది.

సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ రిలీజ్ చేయనున్నారు.

Actor Ajay Plays a Key Role in Suriya Starring24

'24' సినిమాలో టైంమిషీన్ తరహా వాచ్ తయారు చేసిన సూర్య, దాని సాయంతో తన గతంలోకి వెళ్లి తాను చేసిన తప్పులను సరిద్దిదుకోవాలనుకుంటాడని, ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సైంటిస్ట్ గా, అతని కొడుకుగా, ఆత్రేయ అనే విలన్ గా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడట సూర్య.

English summary
Telugu actor Ajay Plays a Key Role in Suriya Starring"24".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu